Advertisement

నానిని ఇక నేచురల్‌ స్టార్‌ అని పిలవచ్చా..!

Fri 10th Feb 2017 12:40 PM
ravi teja,chiranjeevi,nani,nenu local movie,natural star nani,producer dil raju  నానిని ఇక నేచురల్‌ స్టార్‌ అని పిలవచ్చా..!
నానిని ఇక నేచురల్‌ స్టార్‌ అని పిలవచ్చా..!
Advertisement

సినిమా రంగంలో కొందరు భజనపరులు ఇంకా ఆయా హీరోల మొదటి చిత్రాలు కూడా విడుదల కాకముందే వారికి బిరుదులు పెడుతుంటారు. ఇలా వారసుల విషయంలో అనాదిగా జరుగుతోంది. దీనికి మెగా, నందమూరి, ఘట్టమనేని, అక్కినేని.. ఏ ఫ్యామిలీ కూడా మినహాయింపు కాదు. కానీ చిరంజీవి, రవితేజ వంటి స్వయంకృషితో ఎదిగిన వారికి మాత్రం బిరుదులు కాస్త ఆలస్యంగా వస్తుంటాయి. సుప్రీం హీరో నుండి మెగాస్టార్‌ వరకు చిరు సినీ ప్రస్ధానం అందరికీ తెలిసిందే. 

ఇక రవితేజ ఎన్నో చిత్రాలలో నటించి తన సత్తా చూపి, ఓన్‌గా తన మార్కెట్‌ను 25కోట్ల వరకు చేర్చుకుని, తనకంటూ ఓన్‌ ఐడెంటిటీ, మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న తర్వాత మాత్రమే ఆయనకు మాస్‌మహారాజా అనే బిరుదు సొంతం అయింది. కాగా ఇటీవల నాని కూడా వరుస విజయాలు సాధిస్తుండటంతో ఆయనను ఇప్పటికే కొందరు నేచురల్‌స్టార్‌ అని పిలుస్తున్నారు. ఆయనకు కరెక్ట్‌గా సూటయ్యే బిరుదే అది. కానీ నానిని ఇప్పటికిప్పుడే స్టార్‌గా పిలవడం కొందరికి ఇష్టం లేదు. 

విషయానికి వస్తే నాని కెరీర్‌ను 'భలే భలే మగాడివోయ్‌' ముందు తర్వాత అని చెప్పుకోవాల్సివుంది. ఈ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. ఇలా ఆయన తాజాగా డబుల్‌ హ్యాట్రిక్‌ను కూడా సాధించాడంటున్నారు. నిన్నటివరకు నాని రేంజ్‌ కేవలం 15 నుంచి 20కోట్లు మాత్రమే. కానీ 'భలేభలే మగాడివోయ్‌' దీనిని మించింది. ఈ విజయంలో నిర్మాతలకు కూడా ఎక్కువ క్రెడిట్‌ లభించిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటివరకు లాంగ్‌రన్‌లో మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ ఓపెనింగ్స్‌ విషయంలో డల్‌గా ఉన్నాడు. సినిమా బాగున్న తర్వాత లాంగ్‌రన్‌లో కలెక్షన్లు వస్తున్నాయే గానీ ఓపెనింగ్స్‌లో విఫలమవుతున్నాడు. 

ఒకరిని స్టార్‌ అని పిలవాలంటే వారికంటూ ఓపెనింగ్స్‌, సొంత ఇమేజ్‌ ముఖ్యం. తాజాగా నాని నటించిన 'నేను.. లోకల్‌'తో ఆయన ఆ లోటును కూడా భర్తీ చేశాడు. ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ని సాధించి, మొదటి ఐదురోజుల్లోనే 22 కోట్ల షేర్‌ను వసూలు చేసిందంటున్నారు. ఇదే నిజమైతే నానిని గ్రేట్‌ అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కేవలం 20కోట్ల లోపే. అంటే మొదటి వారంలోనే బయ్యర్లకు ఆయన సేఫ్‌జోన్‌లోకి తీసుకెళ్లాడు. ఇక వచ్చేవన్ని లాభాలే. దీంతో ఇప్పుడు నాని కూడా టాప్‌లీగ్‌లోకి ఎంటర్‌ అయ్యాడనే చెప్పాలి. ఇక మరో రెండు చిత్రాలలో కూడా ఆయన ఇదే విధంగా కలెక్షన్లను రాబడితే మాత్రం ఆయన్ను నేచురల్‌స్టార్‌ అని పిలవచ్చు. ఆయన ఇప్పటికే గీతాఆర్ట్స్‌, యువి క్రియేషన్స్‌, అశ్వనీదత్‌కి కూతుర్ల బేనర్‌, 14 రీల్స్‌, ఇక తాజాగా దిల్‌రాజు వంటి పెద్ద నిర్మాలతో చిత్రాలు చేస్తున్నాడు. దీంతో దర్శకులను స్టార్స్‌గా మార్చుతున్న నాని నిర్మాతల విషయంలో మాత్రం పెద్దగా రిస్క్‌ తీసుకోవడంలేదు. దాంతో 'నేను లోకల్‌' విజయంలో దిల్‌రాజుదే కీలకపాత్ర అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement