Advertisement

చిరుకి ఇది నిజంగా అపూర్వం..!

Tue 07th Feb 2017 05:35 PM
chiranjeevi,takkellapadu,khaidi no 150,narayanapuram  చిరుకి ఇది నిజంగా అపూర్వం..!
చిరుకి ఇది నిజంగా అపూర్వం..!
Advertisement

పూర్వకాలంలో మహానటులైన ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి వారి చిత్రాలు విడుదలయ్యాయంటే వాటిని చూడటానికి పల్లెటూర్ల నుండి ప్రజలు ఎద్దుల బండ్లను కట్టుకొని, దగ్గరగా ఉన్న పట్టణంలోని థియేటర్‌కి వెళ్లి చిత్రాలు చూసేవారు. కానీ నేడు ట్రెండ్‌ మారింది. యూట్యూబ్‌లోనే చిత్రాలను సైతం నేటి గ్రామీణ యువత కూడా చూసేస్తున్నారు. ఇక ప్రయాణ సాధనాలు కూడా మారిపోయాయి. ఎద్దుల బండ్ల స్థానంలో బస్సులు, ఆటోలు వచ్చాయి. కాబట్టి ఇలాంటి అరుదైన దృశ్యాలు నేటితరం యువతకు కనిపించడం లేదు. కానీ చిరు దాదాపు దశాబ్దం తర్వాత పూర్తిస్థాయి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీనెంబర్‌150' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన కలెక్షన్లు సాధిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఓ గ్రామస్తులు మాత్రం తమ పూర్వపు సాంప్రదాయాన్ని ఈరోజుల్లో కూడా పాటించి, ట్రెండ్‌ సృష్టించారు. గుంటూరులోని తక్కెల్లపాడు గ్రామస్థులు చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ, తమ ఊరికి దగ్గర ఊర్లోని నారాయణపురంలోని అలంకార్‌ థియేటర్‌కు ఊరు ఊరంతా కలిసి ఎడ్ల బండ్లలో వెళ్లి సినిమా చూశారు. ఇలా ఊరివారంతా ఒకేసారి సినిమా చూడటం అనేది ఈ కాలంలో విశేషమే మరి. దీంతో ఈ టాపిక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో మెగాభిమానులందరూ ఈవిషయాన్ని ట్రెండ్‌ చేస్తూ ఉండటంతో ఈ వార్తకు ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement