Advertisement

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అసలైన పరీక్ష..!

Tue 07th Feb 2017 02:34 PM
hero nani,producer dil raju,keerthy suresh,mohanlal  తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అసలైన పరీక్ష..!
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అసలైన పరీక్ష..!
Advertisement

నాని నిజంగా తెలుగు పరిశ్రమకు ఈ మద్యకాలంలో లభించిన ఓ ఆణిముత్యం. ఓ విశ్లేషకుడు చెప్పినట్లు వంశాల గోలలు.. ఫ్యూడల్‌ ఈలలు వింటూ విసిగిపోతున్న టాలీవుడ్‌కు ఆయన ఓ ఆశాకిరణంగా కనిపించాడు. ఆయన నటించిన వరుస చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. వైవిధ్యభరితమైన కథలు, సహజమైన విలక్షణ నటనతో నాని చాలా మంది ప్రేక్షకులను సేదదీరుస్తున్నాడు. ఆయన ఇప్పటివరకు వరుసగా ఐదు హిట్లిచ్చాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం, మజ్ను' చిత్రాలు పెద్ద హిట్లు కానప్పటికీ ఉన్నంతలో బయ్యర్లను, నిర్మాతలను సేవ్‌ చేశాయి. ఇక ఆయన చాలా అరుదైన డబుల్‌ హ్యాట్రిక్‌కు దిల్‌రాజు నిర్మాణంలో నాని, కీర్తిసురేష్‌లు జంటగా నటించిన 'నేను...లోకల్‌' చిత్రం విజయంతో ఆయన ఘనత సాధిస్తాడని అందరూ భావించారు. 

ఇక ఈ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800ల థియేటర్లలో విడుదలై, మంచి ఓపెనింగ్స్‌ని సాధిస్తోంది. దిల్‌రాజు, నాని, కీర్తిసురేష్‌, దేవిశ్రీప్రసాద్‌ల పుణ్యమా అని ఈ చిత్రం కూడా మంచి కలెక్షన్లు సాధించి హిట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే నాని 'నేను లోకల్‌' పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విభిన్నచిత్రాల ప్రేక్షకులను ఈ చిత్రం డిజప్పాయింట్‌ చేసిందనే వాస్తవం. కేవలం ముందుగా కొన్ని డైలాగ్స్‌ రాసుకుని, దానికి తగ్గ సీన్స్‌ను పేర్చుకుంటూ తీసిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన తొలి చిత్రం 'నువ్వే.. నువ్వే' బాగా ఆడినప్పటికీ ఆయనకు విమర్శలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు 'నేను...లోకల్‌'లో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. 

కానీ ఈ చిత్రం హిట్టయినా కూడా నాని ఫ్యాన్స్‌ పెద్దగా ఆనందించే అవకాశాలు లేవు. ఈ చిత్రానికి కలెక్షన్లు బాగా వస్తున్నా, డివైడ్‌ టాక్‌ వస్తుండటం, విమర్శలు కూడా బాగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అదే రోజున మోహన్‌లాల్‌ నటించిన మలయాళ చిత్రం 'ఒప్పం'కు డబ్బింగ్‌గా వచ్చిన 'కనుపాప' చిత్రం కన్నార్పకుండా చూడాలనిపిస్తూ సాగుతూ ప్రశంసలు అందుకుంటోంది. మోహన్‌లాల్‌ నట విశ్వరూపం.. సముద్రఖని నుంచి బాలనటి వరకు అందరూ నటించిన తీరు, ప్రియదర్శన్‌ దర్శకత్వ ప్రతిభ చూసి అందరూ అబ్బురపడుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్‌ చేయడానికి పలువురు సీనియర్‌ స్టార్స్‌ పోటీ పడినప్పటికీ ఈ చిత్రాన్ని కేవలం అనువదించాలని మోహన్‌లాల్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఆయన చేసిన పాత్రను మరెవ్వరూ చేయలేరని చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. కానీ చూసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం నచ్చుతున్నప్పటికీ చూసే ప్రేక్షకుల సంఖ్యమాత్రం తక్కువగా ఉంది. మరి 'నేను..లోకల్‌, కనుపాప'చిత్రాలలో ఎక్కువగా ప్రేక్షకులు దేనిని ఆదరిస్తారు అనే దానిపై తెలుగు ప్రేక్షకుల అభిరుచి అర్ధం కానుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement