Advertisementt

మరో దర్శకుడి ఆవేదన...!

Mon 06th Feb 2017 01:36 PM
tamil film director,jayalalithaa,seshikala,anna dmk,fazil director,amma tamil movie  మరో దర్శకుడి ఆవేదన...!
మరో దర్శకుడి ఆవేదన...!
Advertisement
Ads by CJ

ఓ చిత్రం ఎలా ఉందో తెలియకుండానే ఆ సినిమాలను నిర్మాణంలోనే అడ్డుకుంటూ దౌర్జన్యాలకు కొందరు దిగుతున్నారు. ఇటీవలే 'రాణి పద్మావతి' షూటింగ్‌పై దాడి చేసి దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని తీవ్రంగా కొట్టి, ఆ షూటింగ్‌ను ఆపివేయించారు. ప్రస్తుతం ఆదే పరిస్థితి మరో దర్శకునికి ఎదురైంది. గతంలో తాను తీసిన కొన్ని చిత్రాలతోనే ప్రశంసలు అందుకున్న ఫైజల్‌ అనే దర్శకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చితలైవి, స్వర్గీయ జయలలిత జీవిత చరిత్రను 'అమ్మ' అనే పేరుతో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జయ మరణం ముందే ప్రారంభించారు. కానీ ఆమె మరణం తర్వాత క్లైమాక్స్‌లో మార్పు చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ క్లైమాక్స్‌ మినహా పూర్తయింది. 

కానీ ఈ చిత్ర నిర్మాతలకు పలు బెదింపులు రావడంతో ఆయన వైదొలిగాడు. మరే నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. ఇక ఈ చిత్రం తెరకెక్కినట్లే అంటూ దర్శకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను జయను తప్పుగా చూపిస్తున్నానని కొందరు భావిస్తూ ఉండవచ్చు. మరికొందరికి ఆమెను గొప్పగా చూపిస్తున్నామనే కక్ష్య ఉండవచ్చు. కానీ సినిమా చూడకుండానే ఇలా బెదిరింపులకు దిగడం న్యాయమా? అని ఆవేదనగా ప్రశ్నిస్తున్నాడు. ఇందులో జయగా రాగిణిద్వివేది నటిస్తోంది. దర్శకనిర్మాతలకు శశికళ నుంచి గానీ, లేదా డీఎంకె పార్టీ నుంచి కానీ బెదిరింపులు వచ్చి ఉంటాయని పలువురు భావిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ