Advertisement

ట్రంప్ ను విమర్శించే హక్కులేనే లేదు..!

Thu 02nd Feb 2017 04:47 PM
america,trump,maharastra,telangana,andhrapradesh  ట్రంప్ ను విమర్శించే హక్కులేనే లేదు..!
ట్రంప్ ను విమర్శించే హక్కులేనే లేదు..!
Advertisement

అమెరికాలో స్థానికుల ఉద్యోగాలను ఇతర దేశాల వారు దక్కించుకుంటూ, తక్కువ జీతాలకే పనిచేయడానికి ఒప్పుకుంటుండంతో అమెరికాలో కూడా నిరుద్యోగ సమస్యలు పెరగడంపై అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌ జాతీయ వాదం పేరుతో తీసుకుంటున్న పలు నిర్ణయాలను అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. మతం పేరుతో ఇతరులపై ఆంక్షలు విధించడాన్ని తప్పుపడుతున్నారు. దీనిపై మన దేశంలోని మేథావి వర్గం కూడా గళమెత్తుతోంది. కానీ ఈ సందర్బంగా ట్రంప్‌పై విమర్శలు చేసేముందు మన దేశంలో కూడా ఏమిజరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ ఉద్యమం చేసి చివరకు ప్రత్యేక రాష్ట్రం దక్కించుకున్నారు. వారేమీ దేశం నుంచి విడిపోతామని ఉద్యమం చేయలేదు. తమకు కేవలం ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రమే ఆందోళన చేశారు. కానీ ఈసందర్భంగా అక్కడి నాయకులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాలన్నీ ఆంధ్రులు దోచుకుంటున్నారని యువతను రెచ్చగొట్టారు. ఇందులో కూడా వాస్తవం ఉంది. ఇక మహారాష్ట్రలో బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల వారు ఉండటంపై అక్కడి కొన్ని మరాఠీ సంఘాలు తీవ్రంగా భౌతిక దాడులకు సైతం దిగాయి. అమితాబ్‌ వంటి వ్యక్తిని కూడా ముంబై విడిచివెళ్లాలని బెదిరించారు. మరి అలాంటి ప్రాంతీయ విభేదాలను, వివక్షతను చూపుతూ, మన ఉద్యోగాలు మనకే దక్కాలని ఎందరో రెచ్చగొడుతున్నారు. 

మరి అమెరికన్ల ఉద్యోగాలను చైనా, భారత్‌ వంటి యువత చేజిక్కించుకొని, అక్కడి అమెరికన్‌ యువతను నిరుద్యోగులను చేయడం తప్పు కాదా? ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు సంబంధించిన వారు విదేశాలలో, మన దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉపాధి పొందడం లేదా? గుజరాత్‌కు చెందిన ఎందరు వడ్డీ వ్యాపారస్థులు మనదేశంలో లేరు? మరి ఇలా ఒక్కదేశంలోనే ఇన్ని రాష్ట్రాలలో.. ఇన్ని ప్రాంతీయ ఉద్యమాలు రావడం సమంజసమేనా? గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ప్రపంచమే చిరు గ్రామంగా మారుతున్న పరిస్థితుల్లో ట్రంప్‌లాంటి వారు పదవులకు ఎక్కడం? వాటికి జాతీయ వాదం, దేశభక్తి అని చాటుకోవడం సహజమే. కాబట్టి మనకు ట్రంప్‌ను విమర్శించే నైతిక హక్కులేనే లేదు. బహుళజాతి సంస్థలు తమ లాభాల కోసం ఎక్కడ యువత తక్కువ జీతాలకు పనిచేస్తారో? ఎక్కడ మానవవనరులు పుష్కళంగా ఉన్నాయో? ఎక్కడ తమకు లాభసాటిగా ఉంటుందో మాత్రమే ఆలోచిస్తారు. మరి ఈ విషయంలో మనం వారిని తప్పుపట్టాల్సిన పనికూడా లేదు... దీనిపై నీతులు మాట్లాడే హక్కు ఎవరికి లేదనేది వాస్తవం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement