Advertisement

ఎవరి ఆలోచనలు, మాట తీరు వారిది!

Wed 01st Feb 2017 12:33 PM
deepika padukune,indraja,alia bhatt,opinions  ఎవరి ఆలోచనలు, మాట తీరు వారిది!
ఎవరి ఆలోచనలు, మాట తీరు వారిది!
Advertisement

దీపికాపడుకోనే.. ఈ బాలీవుడ్‌ సంచలనం తాజాగా 'త్రిపుల్‌ ఎక్స్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించింది. ఇటీవలే ఈ చిత్రం విడుదలై ఇండియాలో మంచి ఆదరణనే పొందుతోంది. కాగా ప్రస్తుతం ఆమె 'పద్మావతి' అనే హిస్టారికల్‌ చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె మాట్లాడుతూ, తాను అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాననే వ్యాఖ్యలకు కోపగించుకోనని, అందుకు తానెంతో గర్వంగా ఫీలవుతానని పేర్కొంది. నేనుపడే కష్టానికి, ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చేసే వసూళ్లకు అది ప్రతిఫలమని పేర్కొంది. ఈ ఘనత తనకు మాత్రమే కాదని, అందరి మహిళలకు అది గర్వకారణమని తెలిపింది. తానేమీ ఎక్కువ సంపాదిస్తున్నానని అనుకోవడం లేదని, ఇతర రంగాలలో తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు ఎందరో ఉన్నారని, కాబట్టి తాను ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకోవడంలో తప్పులేదని నొక్కివక్కాణించింది. అలాగే ప్రస్తుతం తనకు వచ్చిన కీర్తితో సంతృప్తి చెందడం లేదని, ఇంకా ఎక్కువ కీర్తి కోసం కృషి చేస్తున్నానంటోంది. బాలీవుడ్‌ తాజా సంచనలం అలియాభట్‌ అయితే 'శృంగారం'లో మీకే భంగిమ ఇష్టం అనే ప్రశ్న నుంచి 50ఏళ్ల వాడితో రొమాన్స్‌ చేస్తావా? 18ఏళ్ల కుర్రాడితో చేస్తావా? అనే ప్రశ్నకు తాను వయసు, ఎక్కువ అనుభవం ఉన్నవారితోనే ఎంజాయ్‌ చేస్తానంటూ పేర్కొని టాక్‌ ఆఫ్‌ దిటౌన్‌గా మారింది.

 తెలుగులో ఒకప్పటి ఫేమస్‌ హీరోయిన్‌ ఇంద్రజ తాజాగా మాట్లాడుతూ, గతంలో తాను హీరోయిన్‌గా మంచి వెలుగులో ఉన్నప్పుడు అవగాహనారాహిత్యంతో కొన్నితప్పులు చేశానని, తన మేనేజర్‌ తనను తప్పుదోవ పట్టించాడని తెలిపింది. కొందరు నాకు చెప్పే క్యారెక్టర్‌ ఒకటైతే, షూటింగ్‌లో ఇంకో విధంగా తీసేవారని, వారికి తాను అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చివేసి నమస్కారం పెట్టేదానినంది. ప్రస్తుతం తాను అక్క, భార్య, వదిన.. ఇలా ఎలాంటి పాత్రలకైనా సిద్దమేనని, కానీ తాను చేసే సినిమాలో, తాను చేసే పాత్రలో సందేశం ఉండాలని, అండర్‌కరెంట్‌గా మెసేజ్‌ ఉన్నా చాలు.. ఇక ఉత్తరాది భామలే స్టార్స్‌ కాదని, కానీ వారు గ్లామర్‌షోలకు వెనుకాడరని, మన సౌతిండియన్‌ హీరోయిన్లు అలా చేయలేరు.... ఇక నటనలో మాత్రం మనవారు ఎవ్వరికీ తీసిపోం... దానిని సౌందర్యతో పాటు పలువురు నిరూపించారనేది తన అభిప్రాయంగా చెప్పింది. మొత్తానికి ఎవరి మనస్తత్వం వారిది.. ఎవరి వ్యక్తిత్వం వారిది.. ఎవరి మనోభిప్రాయాలు వారివని అనుకోవాల్సిందే...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement