Advertisementt

ఈ స్టార్స్ కోసం పరితపిస్తున్న దర్శకుడు..!

Mon 30th Jan 2017 12:59 PM
balakrishna,chiranjeevi,director sv krishna reddy,balakrishna 101 movie,kv ranga rao  ఈ స్టార్స్ కోసం పరితపిస్తున్న దర్శకుడు..!
ఈ స్టార్స్ కోసం పరితపిస్తున్న దర్శకుడు..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కానీ బాలకృష్ణ ఇప్పటిదాకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. తన 100వ చిత్రం అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చారిత్రక నేపథ్యం వున్న కథతో తీసి కెరీర్లో బెస్ట్ మూవీగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ 'గౌతమీపుత్ర శాతకర్ణి' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ తన 101వ చిత్రాన్ని ఎవరితో చేయనున్నాడనే సస్పెన్సు ఇంకా కొనసాగుతూనే వుంది. అయితే కృష్ణ వంశీ తో 'రైతు' చిత్రాన్ని చేస్తున్నాడని వార్తలొచ్చినప్పటికీ అమితాబచ్చన్ ఒక ఇంపోర్టన్స్ రోల్ కి చేయలేకపోవడం వలన ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేకుండా పోయింది.

మరో పక్కన ఎస్.వి కృష్ణ రెడ్డి డైరెక్షన్ లో బాలకృష్ణ నటించబోతున్నాడనే వార్తలు ఫిలింనగర్లో చక్కెర్లు కొడుతుండగా అనూహ్యంగా బాలయ్య ఒక ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రజినీకాంత్ కి 'లింగా' వంటి అతి భారీ ప్లాప్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్‌తో బాలయ్య తన తదుపరి చిత్రం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక వీరి కాంబినేషన్ లో తెరకెక్కే ఈ చిత్రంపై అపుడే రకరకాలకథనాలు వెలువడుతున్నాయి. అదేమిటంటే కె.ఎస్.రవికుమార్‌ ఒక కథని చిరంజీవికి వినిపించగా.... ఆ కథ విన్న చిరు...  డెసిషన్ ఏం చెప్పకుండా రవికుమార్ ని హోల్డ్ లో పెట్టాడని... ఆ సమయంలో అదే కథతో రవికుమార్, బాలయ్యని సంప్రదించగా బాలయ్యకి కూడా కథ నచ్చిందనే ప్రచారం మొదలయ్యింది. అయితే బాలకృష్ణ తన డెసిషన్ ని రవికుమార్ కి చెప్పలేదనే టాక్ వినబడుతుంది.

మరి ఆ కథని బాలయ్య ఓకె చేస్తే బాలయ్యతో.... చిరు ఓకె చేస్తే చిరుతో ఆ సినిమా చెయ్యడానికి కె.ఎస్.రవికుమార్‌ రెడీగా వున్నాడట. అసలు ఎవరు ఈ కథని ఓకె చేసిన కె.ఎస్.రవికుమార్‌ దశ తిరిగినట్లే కదా.!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ