Advertisement

కులం కంపు కొడుతోంది..!

Sun 29th Jan 2017 07:04 PM
ap,pawan kalyan,chandrababu naidu,balakrishna,venkaiah naidu,aswini dutt,ys jagan  కులం కంపు కొడుతోంది..!
కులం కంపు కొడుతోంది..!
Advertisement

దేశంలోనే కాదు... అన్నిచోట్లా మతం, కులం, ప్రాంతీయాభిమానాలు విపరీతధోరణులు పోతున్నాయి. ఇక మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ కులం గజ్జి ఎక్కువగా ఉంది. ప్రతి విషయాన్ని కులం కోణంలో ఆలోచించే కుహనా మేథావులు ఎక్కువవుతున్నారు. ప్రతి విషయానికి కులం రంగు పులుముతున్నారు. ఈ కులజాడ్యం వీడందే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదనలో ఎంతో ఆర్ధం ఉంది. నేడు ఏపీలో మూడు సామాజిక వర్గాలు పెత్తనం కోసం చెలాయిస్తున్నాయి. అందులో ఒకటి చంద్రబాబు, నందమూరి, వెంకయ్య, సుజనా, అశ్వనీదత్‌.. వంటి వారి సామాజిక వర్గం ఒకటి. రెండోది చిరంజీవి, దాసరి, గంటా, ముద్రగడ పద్మనాభం వంటి వారిది మరోటి. ఇక వైఎస్‌జగన్‌ వ్యక్తి క్రిస్టియన్‌ మతం పుచ్చుకుని, తన పేరు తర్వాత తోకతగిలించుకుని ఏకకాలంగా క్రిస్టియన్ల ఓట్లతో పాటు ఓ సామాజిక వర్గానికి ప్రతినిధిగా మారాలనుకుంటున్నాడు. జె.సి.దివాకర్‌, భూమాలతో పాటు కాంగ్రెస్‌, నేడు వైసీపీలకు వంతపాడుతున్న మరో సామాజిక వర్గం ముఖ్యమైనది. 

ఈ మూడు ముక్కలాటలో మిగిలిన కులాల వారు పావులుగా మారుతున్నారు. ఈ ముగ్గురు తమ తమ కులాలలోని కొందరు మేథావులను, అక్షరజ్ఞానం, ఉన్నతచదువులు. పదవులు ఉన్నవారిని కూడా కులం పేరుతో రెచ్చగొడుతున్నారు. తద్వారా సినిమాలను, రాజకీయాలనే కాదు.. ఇతర రంగాలను కూడా శాసించాలని చూస్తున్నారు. వీరిని చూసి మిగిలిన కులాల వారు కూడా కులం కంపులోకి అడుగుపెడుతూ, కులసంఘాల పేరుతో రెచ్చిపోతూ, బడుగు, బలహీన, వెనుకబడిన, దళిత కార్డులతో అందరినీ హైజాక్‌చేయాలని భావిస్తున్నారు. ఇక ఎప్పుడూ ఈ విషయంలో ముస్లింలు, క్రిస్టియన్లు వంటి మైనార్టీ మతస్తులు తమ రాజకీయాలకు మతం రంగుపులుముతుంటారు.. ఆయా వర్గాల పెత్తనం తమ చేతుల్లోకి రావాలని కలహాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి 'బాడుగ' నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడేవారే లేకుండా పోతున్నారు. ఇక పవన్‌ కూడా ఓ సామాజిక వర్గానికి చెందిన వాడే అయినప్పటికీ ఆయన ఇప్పటివరకు కుల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. 

తనను కొందరు తమ కులం వాడిగా చూస్తున్నారని, అలాంటి వారి సాయం తనకు అక్కర్లేదని కూడా బహిరంగంగా ఆవేదన వెలిబుచ్చాడు. మరి ఈ కుల, మత రాజకీయాలను నిస్వార్థంగా, నిజాయితీగా ద్వేషించేవారికి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం, మన భావితరాలను వీటి నుండి బయటకు పడవేయగల నిజాయితీ ఎంతో అవసరం. దేశంలోనే కాదు.. ప్రపంచంలో కూడా నేడు రెండే వర్గాలు ఉన్నాయి. అవి అగ్రవర్ణ, వెనుకబడిన జాతులు కావు. కేవలం పేద, ధనిక వర్గాలు మాత్రమే ఉన్నాయనేది వాస్తవం. ఎంత రాజకీయంగా, ఆర్ధికంగా ఎదిగినప్పటికీ ఇప్పటికీ రిజర్వేషన్లు, కోటాల పేరుతో ప్రతిభను అణగదొక్కుతున్న వారు నిజమైన జాతి ద్రోహులు. ఈ విషసంస్కృతి నుండి బయటపడకుండా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, చిలకపలుకులు పలికినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement