Advertisementt

కోట్లలో.. ఖైదీ నెంబర్ 150 థాంక్స్ మీట్!

Thu 26th Jan 2017 11:39 AM
khaidi no 150,thanks meet,kotla vijaya bhaskar reddy stadium  కోట్లలో.. ఖైదీ నెంబర్ 150 థాంక్స్ మీట్!
కోట్లలో.. ఖైదీ నెంబర్ 150 థాంక్స్ మీట్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీనంబర్ 150 చిత్రంతో తిరిగి నటుడుగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాస్ ఈజ్ బ్యాక్‌ తో ఈ మధ్య టాలీవుడ్ లో ఏ ప్రేక్షకుడి నోట మాట విన్నా ఖైదీ నెంబర్ 150 చిత్రం విజయం ముచ్చటే నడుస్తుంది. సుమారు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి తిరిగి చిత్రలోకంలోకి ప్రవేశించి ఖైదీనెంబర్ 150 సినిమాతో సంచలనాత్మక చిత్రంగా తెరపై దుమ్మురేపేలా కనువిందు చేస్తున్నారు. అంత గ్యాప్ తీసుకొని సినిమాలో నటించినప్పటికీ కూడా భారీ స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులతో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించి సంక్రాంతి కానుకగా విడుదలైన  ఖైదీనంబ‌ర్ 150 చిత్రం అతి త్వరగానే 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా.. ఆ వెంటనే కేవలం వారం రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం రేపిన చిత్రంగా ఖైదీనెంబర్ 150 చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. అస్సలు ఈ చిత్రంలో చిరంజీవి వయస్సుతో కూడా ఏ మాత్రం సంబంధం లేకుండా ఫైట్స్‌, డ్యాన్సులు, తమ నటనతో అదరగొట్టి మెగాస్టార్లో ఆ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేనంతగా పండించాడు. అలాగే చిత్రాన్ని చూసిన సినీ విమర్శకులు సైతం ప్రశంసల వర్షాన్ని కురిపించారు.

కాగా ఈ ఖైదీ నెంబర్ 150 చిత్రం ఇంతటి భారీ విజయం రావడానికి కారకులైన మెగా, తెలుగుసినీ అభిమానులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేయాలని భావిస్తున్నాడు మెగాస్టార్. ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని ఆదరించిన తెలుగు సినీ ప్రేక్షకాభిమానులకు చిరంజీవి తన కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాడు. జ‌న‌వ‌రి 28న సాయంత్రం 5 గంట‌లకు జ‌రిగే ఖైదీనంబ‌ర్ 150 చిత్రం థాంక్యూ మీట్‌ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, ఈ చిత్రం ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మిగతా చిత్ర‌ బృందం కూడా పాల్గొంటుంది. ఈ కార్యక్రమం కోసం కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి స్టేడియం రెడీ కాబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ