అక్కినేని వారసుడు నాగచైతన్య మరో కొత్త బైక్ కొన్నాడు. చైతుకి బైక్ లంటే మోజు. తరచుగా లాంగ్ డ్రైవ్ చేస్తుంటాడు. అందుకే మార్కెట్లో కొత్త బైక్ లు వచ్చాయంటే చాలా ప్రత్యేకంగా వెళ్ళి వాటిని చూస్తాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తాడు. తాజాగా 27 లక్షలు విలువ చేసే ఎం.వీ అగస్టా సూపర్ బైక్ కొన్నాడు. హెల్మెట్ ధరించి, స్వయంగా నడుపుతూ కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్ళారు. లైఫ్ టాక్స్ 4.5 లక్షలు కట్టాడు. టిఎస్ 07 ఎఫ్ ఎం 2003 నంబర్ తీసుకున్నాడు. 2010లో కూడా చైతు 13 లక్షలు వెచ్చించి యమహా ఆర్ 1 బైక్ కొన్నాడు. దాని నంబర్ ఎపి 9 బిఎక్స్ 4568.
ఈ ఏడాది చైతు, సమంతల వివాహం జరగనుంది. కొత్తజంట సరదాగా విహరించడం కోసమే చైతు ఈ బైక్ కొన్నారని అనుకోవచ్చు. ఇంట్లో ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ నాగచైతన్యకు బైక్ సరదా మాత్రం ఉంది. తరచుగా జూబ్లీ హిల్స్ లో హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తుంటాడు.