Advertisement

మూడు సినిమాలకు కోర్టు నోటీసులు..!

Wed 25th Jan 2017 05:37 PM
mahesh babu,director koratala siva,srimanthudu movie,dhyavuda movie,gautamiputra satakarni,high court noties release  మూడు సినిమాలకు కోర్టు నోటీసులు..!
మూడు సినిమాలకు కోర్టు నోటీసులు..!
Advertisement

కథను కాపీ చేశారని ఒకరిపై, వినోదపు పన్ను మినహాయింపు తగదని మరొకరిపై, దేవుడిని కించపరిచారని మరో కేసుపై న్యాయస్థానాలు విచారణ చేపట్టాయి.  నోటీసులు జారిచేసింది.  

మహేష్  బాబు నటించి 'శ్రీమంతుడు' కథ తనదే అంటూ రచయిత శరత్ చంద్ర ఆరోపించారు. 2012లో తను రాసిన 'చచ్చేంత ప్రేమ' నవలను అనుమతిలేకుండా సినిమా తీసి కాపీరైట్ చట్టం ఉల్లంఘిచారని కోరుతూ క్రిమినల్ కేసు పెట్టాడు. విచారణకు స్వీకరించిన నాంపల్లి న్యాయస్థానం మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత ఎర్నేని నవీన్ ముగ్గురు కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారిచేసింది.

నందమూరి బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి. దీనిపై సివి. ఆదర్శకుమార్ అనే వ్యక్తి సవాల్ చేశారు. మినహాయింపు తగదని అంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చిత్ర నిర్మాతలకు నోటీసులు జారిచేసింది. 

' ద్యేవుడా' అనే సినిమా వ్యవహారంలో ఉమ్మడి హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారిచేసింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement