Advertisementt

బ్యాచిలర్ లైఫ్ కి బై.. బై చెప్పేస్తున్నాడంట..!

Sun 22nd Jan 2017 12:32 PM
rebal star prabhas,baahubali part 2,movie release after prabhas marriage.krishnam raj,prabhas bachelor life is bye bye  బ్యాచిలర్ లైఫ్ కి బై.. బై చెప్పేస్తున్నాడంట..!
బ్యాచిలర్ లైఫ్ కి బై.. బై చెప్పేస్తున్నాడంట..!
Advertisement
Ads by CJ

38 ఏళ్ల మోస్ట్ ఎలిజిబిల్ టాలీవుడ్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కుతున్నాడట. ఇప్పటివరకు అంటే బాహుబలి  పార్ట్స్ రెండు పూర్తయ్యేవరకు పెళ్లి చేసుకోనని భీష్మించుకు కూర్చున్న ప్రభాస్ ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచిసున్నాడట.  ఇక మూడున్నరేళ్ల బాహుబలి చిత్ర షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రభాస్ పెళ్ళికి రెడీ అయ్యాడని చెబుతున్నారు. అయితే బాహుబలి షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది గాని ఇంకా రిలీజ్ కి మాత్రం మూడు నెలలు టైమ్ ఉండడంతో ఈ గ్యాప్ లో పిల్లని సెట్ చేసి సినిమా రిలీజ్ అవ్వగానే పెళ్లిపీటలెక్కిస్తామని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చెబుతున్నారు. అంటే బాహుబలి రిలీజ్ అవడానికి... ప్రభాస్, సుజిత్ చిత్రం మొదలవ్వడానికి మధ్య గ్యాప్ లో ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నాడన్నమాట. అయితే ప్రభాస్ పెళ్లి విషయాన్ని కృష్ణంరాజే స్వయంగా ప్రకటిస్తారా?. అయితే ప్రభాస్ కి తగిన వధువు ఇంకా దొరకలేదని.... వధువుని చూడగానే పెళ్లి గురించి ఎనౌన్స్ చేస్తారని సమాచారం. అంటే ఇక ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పేసి ఒక ఇంటివాడు కావడం ఖాయమనే సంకేతాలు వచ్చేసినట్లే...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ