Advertisementt

బాలయ్య అనుకున్నది సాధిస్తాడా..?

Sat 21st Jan 2017 12:07 PM
balakrishna,gautamiputra satakarni,us tour,gpsk promotion  బాలయ్య అనుకున్నది సాధిస్తాడా..?
బాలయ్య అనుకున్నది సాధిస్తాడా..?
Advertisement
Ads by CJ

బాలయ్యకు ఓవర్‌సీస్‌ మార్కెట్‌లో పెద్ద పట్టులేదు. కానీ ఆయన నటించిన హిస్టారికల్‌ మూవీ 'గౌతమీపుత్ర...' చిత్రం ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లనే సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం యుఎస్‌లో మిలియన్‌ మార్కును దాటిందంటున్నారు. తాజాగా బాలయ్య దర్శకుడు క్రిష్‌, హీరోయిన్‌ శ్రియాలతో కలిసి యుఎస్‌లో మరింత ప్రమోషన్‌ కోసం అక్కడ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన అక్కడి అభిమానులతో, ప్రవాస తెలుగు ప్రజలతో మమేకమై.. ఈ చిత్రానికి అక్కడ మరింత క్రేజ్‌ను తెచ్చే పనిలో పడ్డాడు. గతంలో ఓవర్‌సీస్‌లో బాలయ్యలాగానే పెద్దగా పట్టులేని మెగాహీరో రామ్‌చరణ్‌ కూడా తన 'ధృవ' చిత్రం కోసం యుఎస్‌లో పర్యటించి, తాననుకున్న మిలియన్‌ మార్క్‌ను అందుకోగలిగాడు. ఇప్పుడు బాలయ్య లక్ష్యం 1.5 మిలియన్‌ డాలర్ల మీదే ఉంది. మరి తన యూఎస్‌ ప్రోగ్రాంతో బాలయ్య కూడా తాననుకున్న లక్ష్యాన్ని సాధించి, ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను విస్తరించుకుంటాడా? అందులో సక్సెస్‌ అవుతాడా? లేదా? అన్నది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. బాలయ్య చేసే ఈ పర్యటన చరణ్‌ లాగానే సక్సెస్‌ అయితే భవిష్యత్తులో మరింత మంది హీరోలు ఇదే దారిలో నడవడానికి మార్గం సుగుమమవుతుందని, ఇలా కొత్త ట్రెండ్‌కు తెరతీసిన ఘనత చరణ్‌, బాలయ్యలకు దక్కుతుందంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ