Advertisementt

చిరు... బాలయ్య మధ్య పోలిక..!

Wed 18th Jan 2017 08:37 PM
nandamuri balakrishna,chiranjeevi,ram charan,mokshagnan,chiru two daughters,balayya two daughters  చిరు... బాలయ్య మధ్య పోలిక..!
చిరు... బాలయ్య మధ్య పోలిక..!
Advertisement
Ads by CJ

సంక్రాంతికి పందెం కోళ్ళుగా బరిలోకి దిగి విజయబావుటా ఎగరేసిన చిరంజీవి, బాలకృష్ణ మధ్య కొంత పోలీక కూడా ఉంది. ఇది కాకతాళీయమే అనుకోవచ్చు.' ఖైదీ నంబర్ 150' చిరంజీవికి 150 సినిమా కాగా, 'గౌతమిపుత్ర శాతకర్ణి' బాలకృష్ణకు 100వ చిత్రం. ఇద్దరికీ ఇవి కెరీర్ పరంగా మైలురాళ్ళు. ఇక వీరిద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. బాలకృష్ణ శానససభ్యుడిగా, చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతకు ముందు అంటే 2009లో చిరంజీవి శాసనసభ్యుడి కొంతకాలం ఉన్నారు. అలాగే వీరిద్దరు శాసనసభ్యులుగా గెలిచింది రాయలసీమ నుండే. బాలకృష్ణ హిందూపురం, చిరంజీవి తిరుపతి నుండి గెలిచారు. గడచిన ఎన్నికల్లో  చిరు, బాలయ్య తమ పార్టీల తరుపున ప్రచారం చేశారు. వ్యక్తిగత జీవితానికి వస్తే ఇద్దరికీ కూడా  ఇద్దరు ఆడ పిల్లలు, ఒకే ఒక మగసంతానం. అలాగే చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికే తాతలయ్యారు. చిరంజీవి ఇప్పటికే తన వారసుడు చరణ్ ను వెండితెరకు పరిచయం చేయగా, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాది హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ