Advertisementt

త్రిషకు రక్షణ కావాలట..!

Tue 17th Jan 2017 03:36 PM
trisha,jallikattu,trisha krishna mother,police protection  త్రిషకు రక్షణ కావాలట..!
త్రిషకు రక్షణ కావాలట..!
Advertisement
Ads by CJ

నటి త్రిషకు కొత్త ఇబ్బంది వచ్చిపడింది. తమిళుల సంప్రదాయ క్రీడ వివాదం ఆమె మెడకు చుట్టుకుంది. జల్లికట్టుకు ఆమె వ్యతిరేకంగా మాట్లాడిందని అంటున్నారు. తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అయితే తన ట్విట్టర్ ను ఎవరో హాక్ చేశారని ఆమె అంటోంది. జల్లికట్టును సమర్థించే ఫెటా కన్నెర్ర జేసి బెదిరిస్తోందని దీనివల్ల త్రిష ముప్పు ఉందని పేర్కొంటూ ఆమె తల్లి ఉమ చెన్నై పోలీస్ కమీషనర్ ను ఆశ్రయించింది. త్రిషకు భద్రత కల్పించాల్సిందిగా కోరింది.

సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేదించింది. అయినప్పటికీ రజనీకాంత్, కమల్ హాసన్ సహా చాలా మంది తారలు ఇది సంప్రదాయ క్రీడా కాబట్టి నిర్వహించాలంటూ మద్దతు పలికారు. దాదాపు సినీ తారలంతా అనుకూలంగా మాట్లాడారు. కానీ త్రిష మాత్రం తనని బలవంతం చేయకూడదని అంటూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇది వివాదమైంది. ఆమెకు బెదిరింపులు వచ్చాయి. ఇది ముదిరిపాకాన పడకముందే త్రిష తల్లి రక్షణ కల్పించాలంటూ పోలీసుల ఆశ్రయం కోరింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ