Advertisementt

ఆ ఘనత శ్రియ సొంతమవుతుందా.?

Tue 17th Jan 2017 11:17 AM
shriya,second innings,chiranjeevi,senior star heroes,tollywood  ఆ ఘనత శ్రియ సొంతమవుతుందా.?
ఆ ఘనత శ్రియ సొంతమవుతుందా.?
Advertisement
Ads by CJ

ఓ రేర్‌ ఫీటుకు ఓ అడుగు దూరంలో ఉంది సీనియర్‌ హీరోయిన్‌ శ్రియ. 'ఇష్టం' చిత్రంలో దాదాపు 15ఏళ్ల కంటే ముందే ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. తనతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లు తెరమరుగైపోయారు. కొందరు పెళ్లిళ్లు చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు. ఎంతో మంది ఫేడవుట్‌ అయ్యారు. కానీ ఈ విషయంలో శ్రియ రూటే సపరేట్‌. ఆమె సీనియర్‌స్టార్స్‌ అయిన చిరుతో 'ఠాగూర్‌', బాలయ్యతో 'చెన్నకేశవరెడ్డి', వెంకీతో 'సుభాష్‌ చంద్రబోస్‌', నాగ్‌తో 'సంతోషం, నేనున్నాను' వంటి పలు చిత్రాలలో నటించింది. కేవలం సీనియర్‌స్టార్స్‌తోనే కాదు.. యంగ్‌స్టార్స్‌ అయిన పవన్‌, మహేష్‌ల నుంచి ఉదయ్‌కిరణ్‌ వరకు అందరితో జతకట్టింది. ఇక ప్రస్తుతం ఆమె సీనియర్‌ హీరోయిన్‌గా మారి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా ఓ వెలుగువెలుగుతోంది. ఇప్పటికే ఆమె తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వెంకీతో 'గోపాలా.. గోపాలా', నాగ్‌తో 'మనం', బాలయ్యతో తాజాగా 'గౌతమీపుత్ర...' వంటి చిత్రాలలో నటించింది. ఇక ఆమె ఒక్క చిరుతో కలిసి నటిస్తే సెకండ్‌ఇన్నింగ్స్‌లో కూడా సీనియర్‌స్టార్స్‌ అందరితో నటించిన ఘనతను సాధిస్తుంది. మరి ఆ అవకాశాన్ని చిరు ఆమెకు ఇస్తాడో? లేదో? వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ