Advertisementt

సింగం..రంగం లోకి దిగింది...!

Mon 16th Jan 2017 10:30 PM
s3,singam,suriya,suriya s3 promotion starts,january 26 release  సింగం..రంగం లోకి దిగింది...!
సింగం..రంగం లోకి దిగింది...!
Advertisement
Ads by CJ

తమిళంలోనే గాక తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న వర్సటైల్‌ స్టార్‌ సూర్య కెరీర్‌ చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆయన చిత్రాలకు మంచి ప్రశంసలు, టాక్‌ వస్తున్నా కూడా ఈమధ్య ఆయనకు సరైన బ్లాక్‌బస్టర్‌ లేదు. దాంతో తన కెరీర్‌ పలుసార్లు గాడితప్పిన సమయల్లో తనకు 'సింగం'సిరీస్‌ల ద్వారా బ్లాక్‌బస్టర్స్‌ అందించిన యాక్షన్‌ అండ్‌ మాస్‌ చిత్రాల స్పెషలిస్ట్‌ అయిన హరి దర్శకత్వంలోనే అదే సీరీస్‌లో భాగంగా 'ఎస్‌3' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో పవర్‌ఫుల్‌ పోలీస్‌ స్టోరీగా తెరకెక్కించారు. ఇందులో కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో మంచి క్రేజున్న అనుష్క, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల ఈ చిత్రం విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడి, ఆలస్యమైంది. కాగా దీనిని జనవరి26వ తేదీన రిపబ్లిక్‌డే కానుకగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య తన దృష్టినంతా ఇదే చిత్రంపై పెట్టాడు. అందులో భాగంగా భారీఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పటికే కోలీవుడ్‌లో ఈ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇక తెలుగులో కూడా సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం పబ్లిసిటీని ప్రారంభించి, కొన్నిపత్రికల్లో యాడ్స్‌ కూడా ఇచ్చారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూర్య డిసైడ్‌ అయి ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నాడట. మరి ఈ చిత్రం సూర్య కెరీర్‌ను మరలా గాడిలో పెడుతుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ