Advertisement

తమిళ హీరోలు అలా.. మన హీరోలు..?

Mon 16th Jan 2017 03:13 PM
tamil heroes,jallikattu,telugu heroes,cock fights  తమిళ హీరోలు అలా.. మన హీరోలు..?
తమిళ హీరోలు అలా.. మన హీరోలు..?
Advertisement

సంప్రదాయానికి విలువ ఇవ్వాలని, శతాబ్దాల క్రీడకు తమిళ హీరోలు మద్దతు ప్రకటించారు. ఎద్దును మచ్చికచేసుకునే, లొంగదీసుకునే జల్లికట్టుకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. జంతు ప్రేమికుల ఆందోళన అర్థం చేసుకుంటూ, ఈ క్రీడలో పశువులకు గాయాలవుతాయని భావించి క్రీడను నిషేధించింది. కోర్డు ఉత్తర్వులున్నప్పటికీ తమిళ స్టార్లు కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్, శింబు వంటి వారు బాహాటకంగా జల్లికట్టుకు మద్దుతు తెలిపారు. దాంతో కనుమ రోజున జరిగే ఈ క్రీడకు తమిళనాడులో మద్దతు లభించింది. 

ఇలాంటి కోర్టు ఉత్తర్వులు తెలుగునాట జరిగే కోళ్ళ పందాలపై ఉన్నాయి. పక్షి ప్రేమికుల అభ్యంతరాలపై స్పందిస్తూ కోర్టు ఈ పందాలని నిషేధించింది. ఇది కూడా సంప్రదాయ ఆటనే. శతాబ్దాలుగా ఉంది. నాటి బొబ్బిలి యుద్ధం కోళ్ళ పందాల కారణంగానే జరిగింది. అయితే తెలుగు వారి సంప్రదాయాన్ని గుర్తించి మన హీరోలెవరూ అనుకూలంగా మాట్లాడలేకపోయారు.  అది తమకు సంబంధం లేదనే విషయంగా భావించారు. ఈ క్రీడ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఎక్కువ జరుగుతుంది. కోట్ల రూపాయలు చేతులు మారతాయి. కోర్టు ఆదేశాలున్నప్పటికీ కోళ్ళ  పందాలు మాత్రం ఆగలేదనేది వేరే విషయం. 

తమిళ హీరోలకు, తెలుగు హీరోలకు ఉన్న తేడా అర్థమైందనుకుంటా.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement