మొత్తానికి ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన చిరు 'ఖైదీ', బాలయ్య 'గౌతమీపుత్ర..' చిత్రాలు రెండు అదరగొడుతున్నాయి. ఇక దిల్‌రాజు నిర్మించిన 'శతమానం...' కూడా విడుదలయ్యింది. ఈ చిత్రంపై కూడా మంచి టాకే వినిపిస్తుంది. ఇక ఈ నెల 26న సూర్య 'ఎస్3'గా రానున్నాడు. ఫిబ్రవరి విషయానికి వస్తే 3వ తేదీన నాని-దిల్‌రాజుల 'నేను....లోకల్', మంచు విష్ణు 'లక్కున్నోడు', మోహన్‌లాల్ డబ్బింగ్ మూవీ 'కనుపాప' విడుదలకానున్నాయి. 10వ తేదీన నాగ్ 'నమో వేంకటేశాయ', మంచు మనోజ్ 'గుంటూరోడు' రిలీజ్‌కి సన్నాహాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 17న 'ఘాజీ'తో సోలో హిట్ కొట్టడానికి రానా సిద్దమవుతున్నాడు. సో..సంక్రాంతి హడావుడి అయిన వెంటనే..తమ తఢాఖా చూపేందుకు మరి కొందరు హీరోలు రెడీ గా వున్నారన్నమాట.