Advertisementt

వివాదాలకు చెక్‌పెట్టే యత్నం..!

Fri 13th Jan 2017 11:21 PM
nagarjuna,khaidi no 150,gautamiputra satakarni,wishes  వివాదాలకు చెక్‌పెట్టే యత్నం..!
వివాదాలకు చెక్‌పెట్టే యత్నం..!
Advertisement
Ads by CJ

గత కొంతకాలంగా బాలయ్యకు, నాగ్‌కు పడటం లేదనే చర్చ జరుగుతోంది. ఇద్దరూ తమ తమ ఫంక్షన్లకు, పార్టీలకు, సినిమా ఓపెనింగ్స్‌ వంటి ఈవెంట్లకు పిలుచుకోవడం లేదు. బాలయ్య అయితే ఏయన్నార్‌ మరణం తర్వాత పరామర్శేకాదు... ఆయన భౌతికదేహాన్ని కూడా సందర్శించకపోవడం, అఖిల్‌ను టార్గెట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, ఇక నాగ్‌.. అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌కు బాలయ్యను ఆహ్వానించకపోవడం, బాలయ్య 100వ చిత్రం ఓపెనింగ్‌కు నాగ్‌ హాజరుకాకపోవడం వంటివన్నీ ఈ వార్తలకు బలం చేకూర్చాయి. కానీ ఒకప్పుడు ఎవరితోనూ అంటిముట్టనట్లుండే నాగ్‌లో ఈమధ్య మంచిమార్పు కనిపిస్తోంది. అందరితో కలివిడిగా ఉంటున్నాడు. 'ఖైదీ' సందర్భంగా చిరుకు, తాజాగా 'గౌతమీపుత్ర..' విషయంలో బాలయ్యకు, క్రిష్‌కు శుభాకాంక్షలు చెప్పడం, తనకి చారిత్రక చిత్రాలు చూడటమంటే ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించడంతో ఇకపై వీరిద్దరి మధ్య విబేదాల విషయంపై ఎవ్వరూ మాట్లాడకుండా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే యంగ్ హీరో శర్వానంద్ శతమానం భవతి కూడా నాగ్ విశేష్ తెలిపాడు. ఇక శాతకర్ణి కి నాగ్‌తోపాటు మెగాహీరోలైన బన్నీ, సాయిధరమ్‌తేజ్‌లు కూడా బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు కూడా బాబాయ్‌కు విషెష్‌ చెబుతూ, ప్రశంసలు గుప్పిస్తుండటం మంచి పరిణామనే చెప్పాలి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ