Advertisementt

అందుకే దిల్ రాజు కాన్ఫిడెంట్ గా ఉన్నాడా..?

Tue 10th Jan 2017 04:52 PM
dil raju,shatamanam bhavati,sharwanand,all heroes scene  అందుకే దిల్ రాజు కాన్ఫిడెంట్ గా ఉన్నాడా..?
అందుకే దిల్ రాజు కాన్ఫిడెంట్ గా ఉన్నాడా..?
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి రెండు బడా చిత్రాల మధ్యన ఒక కుర్ర హీరో చిత్రం కూడా విడుదలవుతుంది. చిరు 'ఖైదీ నెంబర్ 150' తో కదంతొక్కుతుంటే... బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో గర్జిస్తానంటున్నాడు. మరి ఇంతటి సీనియర్ స్టార్స్ తో పాటు ఈ సంక్రాంతికి శర్వానంద్ కూడా 'శతమానం భవతి' అంటూ వస్తున్నాడు. అయితే నిర్మాత దిల్ రాజు ఎటువంటి టెన్షన్ పడడం లేదు ఈ సినిమా విడుదల గురించి. అంత పెద్ద స్టార్స్ సినిమాల మధ్యలో చిన్న చిత్రాన్ని విడుదల చెయ్యడానికి దిల్ రాజు ఎందుకు భయపడడం లేదో? అని అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు.

అయితే దిల్ రాజు కాన్ఫిడెంట్ కి ఒక కారణం ఉందని ఒక గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న ఈ 'శతమానం భవతి' చిత్రంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఒక సీన్ లో ఈ స్టార్స్ కనిపించనున్నారని సమాచారం. మహేష్‌, ఎన్టీయార్‌, బన్నీ... వంటి టాప్ స్టార్స్ ఈ చిత్రంలో కనబడనున్నారని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో నిజంగా వీరంతా యాక్ట్ చెయ్యడం లేదట. కేవలం వివిధ సినిమాల్లోని టాప్  హీరోల డైలాగ్‌ వీడియోలను కట్‌ చేసి ఈ సినిమాలో ఎడిటింగ్ చేసి వాడుతున్నారట. ఆ బిట్స్ అన్నిటిని ఒక సీన్‌గా మార్చి నిజంగా వారు మాట్లాడుకున్నంత నేచురల్ గా తయారు చేశారట. 

మరి ఇదంతా దిల్ రాజు మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. అసలు ఈ సీన్‌ సినిమాకు చాలా పెద్ద హైలెట్ అవుతుందని దిల్‌ రాజు భావిస్తున్నారట.  నిజంగా స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కోసం పెద్ద హీరోలతో గెస్ట్ రోల్స్‌ వేయించడం చూశాం కానీ..... ఇలా అందర్నీ ఒకే సీన్‌లో చూపించాలనే ఐడియా మాత్రం కొంచెం కొత్తగానే వుంది కదా. అందుకే దిల్ రాజు మామూలోడు కాదని అంటారు అందరూ...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ