పెద్ద నిర్మాతల చేతిలో చిన్నహీరో...!

Mon 09th Jan 2017 12:02 PM
hero vijay devarakonda,pelli chupulu movie hero,producer allu aravind,r b choudari,dwaraka movie,arjun reddy movie  పెద్ద నిర్మాతల చేతిలో చిన్నహీరో...!
పెద్ద నిర్మాతల చేతిలో చిన్నహీరో...!
Sponsored links

ఒక ఆరు నెలల ముందు వరకు కూడా ఎవ్వరికీ విజయ్‌దేవరకొండ అంటే తెలియదు. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌, ఎవడే సుబ్రహ్మణ్యం' వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయనకు ఇటీవల పెద్ద బ్రేక్‌ వచ్చింది. 'పెళ్లి చూపులు' చిత్రంలో హీరోగా అద్భుతంగా నటించిన ఆయన ఒక్కసారిగా ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంతో బ్రేక్‌ సాధించాడు. గతంలో కూడా రవితేజ వంటి వారు, ఈ మధ్యకాలంలో నాని, నిఖిల్‌, శర్వానంద్‌ వంటి హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్‌, అండదండలు లేకుండానే హీరోలుగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో విజయ్‌ దేవరకొండ కూడా చేరాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయనకు పెద్ద నిర్మాణసంస్థలలో ఆఫర్లు లభిస్తూ, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి నిర్మిస్తున్న 'ద్వారకా'తో పాటు 'అర్జున్‌రెడ్డి' అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. 

ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. టాలెంట్‌ ఉన్న మహిళా దర్శకురాలిగా ఎదుగుతున్న నందినిరెడ్డి దర్శకత్వంలో ఆయన మరో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని స్వయంగా మాటల మాంత్రికుడు, స్టార్‌డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తుండటం విశేషం.ఇక ప్రముఖ భారీనిర్మాత అశ్వనీదత్‌కు చెందిన '3ఎంజిల్స్‌' బేనర్‌లో ఓ చిత్రం కమిట్‌ అయ్యాడు. మెగాప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ తనయుడు బన్నీ వాసు నిర్మాతగా 'గీతాఆర్ట్‌ బేనర్‌2'లో టాలెంటెడ్‌ దర్శకుడు పరుశురాంతో కూడా కలిసి పనిచేయనున్నాడు. వీటితో పాటు ఇటీవల నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూ వరుసగా మంచి మంచి చిత్రాలను నిర్మిస్తున్న వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి నిర్మాణంలో ఆయన బేనర్‌లో ఓ చిత్రం అంగీకరించాడని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నాడు. ఇక ప్రసిద్ద నిర్మాణసంస్థ, స్వర్గీయ డి.రామానాయుడు తనయుడు డి.సురేష్‌బాబు సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ జోరు చూస్తుంటే రాబోయే రెండేళ్లలో ఈ హీరో జాతకమే మారిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019