Advertisementt



దీపికా.. వల్ల రిలీజ్ డేటే మారిపోయింది!

Sat 07th Jan 2017 03:31 PM
deepika padukune,triple x,hollywood movie,release date  దీపికా.. వల్ల రిలీజ్ డేటే మారిపోయింది!
దీపికా.. వల్ల రిలీజ్ డేటే మారిపోయింది!
Advertisement
Ads by CJ

భారతీయ మార్కెట్‌ను కొల్లగొట్టాలని భావిస్తున్న హాలీవుడ్‌ మేకర్స్‌ ప్రస్తుతం తమ చిత్రాలలో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లకు అవకాశాలు ఇస్తూ, వారిని తమ అస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లయిన దీపికాపడుకొనే, ప్రియాంకా చోప్రాలు హాలీవుడ్‌ చిత్రాలలో అవకాశాలు సాధిస్తున్నారు. కాగా దీపికా నటించిన 'ట్రిపుల్‌ ఎక్స్‌' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 19న విడుదల కానున్నప్పటికీ దీపికా మాయ చేస్తుందన్న నమ్మకంతో దీనిని ఓ వారం ముందుగా అంటే ఈనెల 14న పండగకే ఇండియాలో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ వీన్‌డీజిల్‌ ఈ చిత్రం ప్రమోషన్స్‌ కోసం 12వ తేదీన భారత్‌ రానున్నాడు. ఈ చిత్రానికి ఇండియాలో గ్రాండ్‌గా ప్రీమియర్‌షోలను ప్రదర్శించనున్నారు. ఇదంతా దీపికా పుణ్యమేనని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో హీరోకి సాయం చేసే ప్రియురాలి పాత్రలో దీపికా కీలకపాత్రను పోషించింది. మరి ఈ చిత్రం విడుదలైతే గానీ ఇందులో దీపికాకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారనే విషయం తెలియదని బాలీవుడ్‌ విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ