Advertisementt

అఖిల్ రెండో సినిమాకి ఈసారి అఖిలే అడ్డు!

Sat 07th Jan 2017 01:11 PM
akhil,akhil marriage,akhil second film vikram k kumar  అఖిల్ రెండో సినిమాకి ఈసారి అఖిలే అడ్డు!
అఖిల్ రెండో సినిమాకి ఈసారి అఖిలే అడ్డు!
Advertisement
Ads by CJ

అఖిల్ మొదటి సినిమాకి రెండో సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది. అఖిల్ తన రెండో సినిమాని మొదలు పెట్టడానికి బాగా టైమ్ తీసుకున్నాడు. మొదటి సినిమా 'అఖిల్' తో దెబ్బ తిన్న అఖిల్ తన రెండో సినిమా మళ్ళీ అటు ఇటు అయితే కష్టమని భావించి చాలా కథలు విన్న తర్వాత..... ఎంతోమంది డైరెక్టర్స్ ని సంప్రదించిన తర్వాత ఎట్టకేలకు అక్కినేని ఫ్యామిలీతో 'మనం' వంటి హిట్ సినిమా తీసిన విక్రమ్ కే కుమార్ ని డైరెక్టర్ గా ఎంపిక చేసాడు అఖిల్ తండ్రి నాగార్జున. ఇక ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉండగా విక్రమ్ పెళ్లి చేసుకోవడం తో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండా ఆగింది. విక్రమ్ కూడా పెళ్లి తర్వాత బాగా టైమ్ తీసుకుని ఈ సినిమాని మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు.

ఇక సినిమా ఈ నెలలో మొదలు పెడతారు అనుకుంటున్న టైమ్ లో మళ్ళీ అఖిల్ పెళ్లి వల్ల ఇది లేట్ అయ్యేట్టు కనబడుతుంది. ఇప్పటికే అఖిల్ డిసెంబర్ 9  న శ్రీయ భూపాల్ తో ఎంగేజ్మెంట్  చేసుకుని పెళ్లి కోసం రెడీ అవుతున్నాడు. ఇక విక్రమ్ తో సినిమా ఈ నెల 14  న మొదలు పెట్టి పూజ కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ షూటింగ్ జరుపుకోవడానికి మాత్రం బాగా గ్యాప్ తీసుకునేలా ఉందని అంటున్నారు. అందుకే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి మాత్రం భారీ గ్యాప్ తీసుకుంటుందనే వార్తలు బాగా  ప్రచారంలోకొచ్చాయి. ఆలస్యమైతే అయ్యింది గాని విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ హీరో గా వచ్చే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ