Advertisement

పవన్ వచ్చినా ప్రాబ్లమే..రాకపోయినా ప్రాబ్లమే!

Thu 05th Jan 2017 01:07 PM
pawan kalyan,khaidi no 150,pre release function,ram charan,chiranjeevi  పవన్ వచ్చినా ప్రాబ్లమే..రాకపోయినా ప్రాబ్లమే!
పవన్ వచ్చినా ప్రాబ్లమే..రాకపోయినా ప్రాబ్లమే!
Advertisement

ఇప్పటి వరకు చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సంబందించిన టెంక్షన్ పడ్డ చిరు, చరణ్ లు ఇప్పుడు మరో విషయం లో టెంక్షన్ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అసలు 'ఖైదీ..' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 4 న విజయవాడలో జరగాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల అనుమతి మంజూరు చేయకపోవడంతో ఆ వేదికని, డేట్ ని కూడా మార్చుకుని గుంటూరు సమీపంలో హయ్ ల్యాండ్ లో ఈ నెల 7 న జరపనిశ్చయించారు. ఇక ఇప్పటి వరకు ఫంక్షన్ కి డేట్, వేదిక గురించిన టెంక్షన్స్ పడగా ఇప్పుడు చరణ్, చిరులు కి పవన్ కళ్యాణ్ టెంక్షన్ మొదలైందని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' ఫంక్షన్ కి గనక ఒకవేళ హాజరు కాకపొతే అక్కడి అభిమానులతో వేగడం చాలా కష్టమైన పని. ఇప్పటికే పవన్ రాకపోవడం వల్ల చాలా ఫంక్షన్స్ లో పవన్ అభిమానులు మిగతా మెగా హీరోలను మాట్లాడనీయకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక ఏదో అల్లు అర్జున్ అప్పట్లో మెగా ఫ్యాన్స్ కి క్లాస్ పీకినా... కూడా వారిలో ఏ మార్పు రాలేదనేది జగమెరిగిన సత్యం. మరి ఇప్పుడు కూడా అల్లు అరవింద్ దగ్గర నుండి చరణ్ వరకు పవన్ వస్తాడో రాడో..... ఆయన విదేశాల్లో ఉంటే గనక రాకపోవచ్చని మెగా ఫ్యాన్స్ ని ఇప్పటినుండే ప్రిపేర్ చేస్తున్నారు. అసలిప్పటికే పవన్ కి ఇన్విటేషన్ కూడా ఇచ్చానని చెబుతున్నాడు రామ్ చరణ్. ఆయనేం చిన్నపిల్లాడు కాదు.. రావాలనుకుంటే ఆయనే వస్తాడని చరణ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. మరి ఒకవేళ పవన్ గనక 'ఖైదీ... ' ఫంక్షన్ కి హాజరవకపోతే అక్కడ ఫ్యాన్స్ ఏం గందరగోళం చేస్తారో అని ఇప్పుడు చిరంజీవికి, రామ్ చరణ్ కి పెద్ద టెంక్షన్ గా ఉందని అంటున్నారు. పవన్ రాకపోతే ఫ్యాన్స్ ఏ మెగా హీరో ని మాట్లాడనివ్వకుండా పవన్, పవన్ అవి అరిచే ప్రమాదం చాలానే ఉందని వారి టెంక్షన్ కాబోలు. 

ఇదిలా ఉంటే..పవన్ వచ్చిన కూడా మెగా హీరోలకు ప్రాబ్లమే. ఎందుకంటే..ఇది చిరంజీవి ఫంక్షన్. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చాలా మంది మెగాస్టార్ కంటే కూడా పవర్ స్టార్ కే ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారు. అన్నయ్య తర్వాతే..అని పవన్ చెప్పిన వినే పరిస్థితి..లేదనేది అందరికి తెలిసిన విషయమే. ఈ ఫంక్షన్ లో చిరంజీవి మెయిన్ హైలైట్ కావాలి. అదే పవన్ వస్తే..చిరు పరిస్థితి ఏమిటో..'సర్దార్' ఆడియో లో చూసే వున్నారు. ఎప్పుడూ.. ఏ ఆడియో ఫంక్షన్ కి చిరు అటెండ్ అయినా..అందరికంటే లాస్ట్ లో చిరు ప్రసంగం ఉంటుంది. అలాంటిది.. ఆ ఆడియో లో చిరు ని ముందుగా మాట్లాడించి..ఆ తర్వాత లాస్ట్ లో పవన్ మాట్లాడాడు. ప్రస్తుత పరిస్థితుల్లో..పవన్ ఎదురుగా ఉంటే..ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో..తెలిసి కూడా పవన్ ని ఈ ఈవెంట్ కి తీసుకురావాలని..మెగా హీరోలు బహుశా..అనుకుని వుండరు. సో.. పవన్ వచ్చిన ప్రాబ్లమే..రాకపోయినా..ప్రాబ్లమే. రెండు వైపులా చిరు, చరణ్ లు ఇరుక్కుపోయారు. అసలు ఆడియో వేడుక జరపనిది కూడా ఇందుకోసమే అనే వార్తలు ఇండస్ట్రీ లో వున్నాయి. ఫ్యాన్స్ బలవంతం చేయడంతోనే..ఈ ఈవెంట్ ని చేస్తున్నట్లుగా టాక్.  సో..పవన్ విషయం లో.. ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ నెల 7 వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement