Advertisementt

అంతటి అదృష్టాన్ని పొందిన హీరోయిన్...!

Wed 04th Jan 2017 05:14 PM
chiranjeevi,khaidi no 150,balakrishna,gautamiputra satakarni,kajal,shriya  అంతటి అదృష్టాన్ని పొందిన హీరోయిన్...!
అంతటి అదృష్టాన్ని పొందిన హీరోయిన్...!
Advertisement
Ads by CJ

చారిత్రక నేపథ్యంలో వస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' లో బాలకృష్ణకి జోడిగా శ్రీయ నటిస్తుంది. ఈ చిత్రం ఈ సంక్రాంతికే విడుదలవుతుందని డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. ఇందులో శ్రీయ కట్టు బొట్టుతో అందరిని ఆకట్టుకునేలా టీజర్స్, ట్రైలర్స్, ఫొటోస్ లో కనిపించింది. అయితే ఇప్పుడు శ్రీయ శరణ్ ఒక కొత్త రికార్డుని నెలకొల్పబోతుందని అంటున్నారు. ఎలా అంటే ఇటు బాలయ్య బాబు 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' లో హీరోయిన్ గా నటించడమే కాకుండా అటు మెగా స్టార్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయే 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో కూడా ఒక గెస్ట్ రోల్ లో చేసిందని ప్రచారం జరుగుతుంది.

అసలు 'ఖైదీ...'లో స్పెషల్ సాంగ్ లో శ్రీయ డాన్స్ చేస్తుందని అన్నారు ఆ మధ్యన. కానీ శ్రీయ ఐటెం సాంగ్ లో లేదుగాని ఒక గెస్ట్ రోల్ మాత్రం చేసిందనే టాక్ బయటికి వచ్చింది. అయితే ఈ న్యూస్ పై 'ఖైదీ...' యూనిట్ మాత్రం స్పందించలేదు. 'ఖైదీ  నెంబర్ 150' లో డ్యూయల్ రోల్ చేస్తున్న చిరంజీవికి ఒక హీరోయిన్ గా కాజల్ చేస్తుండగా  మరో హీరోయిన్ గా శ్రీయ చేస్తుందని చెబుతున్నారు. ఇక అది గనక నిజమైతే శ్రీయ ఒక రేర్ రికార్డు సాధించినట్టే. టాలీవుడ్ సీనియర్స్ ల్యాండ్ మార్క్ మూవీస్ లో నటించడం ఒక ఎత్తైతే ఆ రెండు చిత్రాలు సంక్రాతి బరిలో ఉండడం మరో ఎత్తు. అబ్బా శ్రీయకి ఎంతటి అదృష్టం కలిసొచ్చిందో అని అందరూ తెగ ఇదై పోతున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ