Advertisement

ఎన్టీఆర్ సినిమాలో...అతిలోకసుందరా..!

Wed 04th Jan 2017 11:48 AM
jr ntr,sridevi,kona venkat,bobby,ks ravindra,sridevi in jr ntr and bobby movie  ఎన్టీఆర్ సినిమాలో...అతిలోకసుందరా..!
ఎన్టీఆర్ సినిమాలో...అతిలోకసుందరా..!
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో, కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేసుకుని ఈ నెలలోనే సెట్స్ మీదకి తీసుకెళుతున్నాడు బాబీ చిత్రాన్ని ఎన్టీఆర్. అయితే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ విషయంలో కొంచెం గందర గోళం ఏర్పడింది. స్వయంగా కళ్యాణ్ రామ్ రంగం లోకి దిగి మరీ ఇంకా ఈ సినిమాకి టైటిల్ అంటూ ఏం అనుకోలేదని వివరణ ఇచ్చాడు.

ఇక ఎన్టీఆర్ సినిమా కి సంబందించిన న్యూస్ అంటే అందరిలో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఏ విషయమైనా ఒక సంచలన విషయంలానే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర కథనం ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే ఎన్టీఆర్ చిత్రంలో అలనాటి అందాల తార శ్రీదేవి ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతుందని సోషల్ మీడియా అంతా ఇప్పుడొక న్యూస్ హల్ చల్ చేస్తుంది. శ్రీదేవి తెలుగు సినిమాల్లో కనిపించక చాలాకాలమే అయ్యింది. మొన్నామధ్యన నటనకు రీ ఎంట్రీ ఇచ్చి 'ఇంగ్లీష్ వింగ్లీష్' లో కనబడిన శ్రీదేవి మళ్ళీ లైన్లోకి వచ్చిందనుకున్నారు. అప్పుడెప్పుడో 'బాహుబలి'లో ప్రభాస్ తల్లి కేరెక్టర్ కి సంప్రదించగా దానికి శ్రీదేవి భారీగా డిమాండ్ చెయ్యగా ఆ చిత్ర డైరెక్టర్ రాజమౌళి శ్రీదేవిని తప్పించి రమ్యకృష్ణని శివగామి కేరెక్టర్ కి ఎంపిక చేసాడు. ఇక తర్వాత శ్రీదేవి తమిళ స్టార్ హీరో విజయ సినిమా 'పులి' లో మెరిసింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. 

అయితే ఇప్పుడు శ్రీదేవి.. ఎన్టీఆర్ మూవీలో నటించనుందని ప్రచారం జోరందుకుంది. ఇక ఈ సినిమాతోనే తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. మరి శ్రీదేవి అంత తేలికగా ఒప్పుకోదని తెలిసి బాబీ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకు కథని అందిస్తున్న కోన వెంకట్... శ్రీదేవిని ఒప్పించే పనిలో పడినట్లు చెబుతున్నారు. ఒకవేళ శ్రీదేవి గనక ఈ సినిమా ఒప్పుకుంటే ఈ సినిమా పై ఉన్న అంచనాలు 1000  రేట్లు పెరిగే అవకాశం వుంది. అసలు ఎన్టీఆర్ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఇక శ్రీదేవి కూడా నటిస్తే అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement