Advertisementt

మంచు విష్ణు తగ్గనంటున్నాడు..!

Tue 03rd Jan 2017 07:15 PM
manchu vishnu,lakkunnodu movie,director pame kishore,vishnu o romantic entertrainement movie,two heroines,kutti miyajarza,surabhi  మంచు విష్ణు తగ్గనంటున్నాడు..!
మంచు విష్ణు తగ్గనంటున్నాడు..!
Advertisement
Ads by CJ

జయాపజయాలను పక్కనపెడితే హీరో మంచు విష్ణు మాత్రం వరస చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. ఆయన నటించిన 'లక్కున్నోడు' చిత్రాన్ని డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తారని, ఆ తర్వాత ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ ఆలస్యం అవుతుండటంతో ఆలస్యం అవుతోందని యూనిట్‌ అంటోంది. ఈ చిత్రం ఇంకా విడుదల కాముందే విష్ణు మరో చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. 

'అడ్డా' ఫేమ్‌ కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను చేయనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా కేరళ కుట్టి మియాజార్జ్‌ నటిస్తోంది. ఈమె ప్రస్తుతం సునీల్‌ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో కూడా చేస్తోంది. ఇక విష్ణు చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ను కూడా ఫైనల్‌ చేశారట. 'జెంటిల్‌మన్‌' చిత్రంలో నటించిన సురభి ఇందులో రెండో నాయికగా నటించనుందని సమాచారం. కాగా ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రారంభం కానుంది. మరి హిట్టు కొట్టి ఎంతో కాలం అయిన విష్ణు ఈ రెండు చిత్రాలతోనైనా ట్రాక్‌లోకి వస్తాడా? లేదా..? అనేది వేచిచూడాలి 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ