Advertisement

ప్రత్యేకహోదాపై చాన్నాళ్ళకు..బాబు వ్యాఖ్యలు!

Tue 03rd Jan 2017 12:19 PM
special status,amaravathi,chandrababu naidu,chandrababu naidu sensational comments  ప్రత్యేకహోదాపై చాన్నాళ్ళకు..బాబు వ్యాఖ్యలు!
ప్రత్యేకహోదాపై చాన్నాళ్ళకు..బాబు వ్యాఖ్యలు!
Advertisement

కొత్త సంవ‌త్స‌రాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. మొదటగా ఎత్తుకోవడంలోనే ఆయన 2016వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కి ఒక చారిత్రక సంవ‌త్స‌రంగా అభివర్ణించాడు. 2016 మనం చాలా వాటిని సాధించుకున్నామని ఆయన వివరించాడు. అసలు నిజం చెప్పాలంటే... 2016లో తెదేపా సాధించింది ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీనే. అదీ కూడా ఒట్టి ప్యాకేజీ మాత్రమే. ఇంకా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి చాలా రోజుల తర్వాత నోరు తెరిచాడు. ఆయన మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా అనేది ఒక అరుంధ‌తి న‌క్ష‌త్రం వంటిదని.. బాబుగారు భలే పోలిక చెప్పాడే. అంటే అరుంధతి నక్షత్రం క‌నిపించక పోయినా సరే మాయలతో కనిపించిందని ఒప్పేసుకోవాలని ఆయన తెలిపాడు. ఇంకా బాబుగారు మాట్లాడుతూ... తాను హోదా విషయంపై చాలా స్టడీ చేశానని, అయితే పలుకోణాలతో చేసిన పరిశోధన ఆధారంగా.. ప్రత్యేకహోదా కంటే కూడాను... ప్ర‌త్యేక ప్యాకేజీనే ఉత్తమమని ఒప్పుకున్నానని ఆయన వెల్లడించాడు. మొత్తానికి ప్ర‌త్యేక ప్యాకేజీని ఒప్పుకొనే ముందు బాబు మరింత మేథోమ‌థ‌నం జరిపాడన్నమాట.  

అదే విధంగా వెల‌గ‌పూడి గురించి మాట్లాడుతూ.. వెలగపూడిలో ప‌నులన్నీ చాలా వేగవంతంగా అవుతున్నాయని, వెల‌గ‌పూడికి వ‌చ్చినప్పటి నుండి అన్నీ పాజిటివ్‌ సంకేతాలే కనపడుతున్నాయని ఆయన తెలిపాడు. ఇక్కడ ఏ ప‌ని మొద‌లెట్టినా కూడా చాలా ఫాస్ట్ గా అవుతుందని, అదే విధంగా రాజ‌ధాని శంకుస్థాప‌న స‌మ‌యంలో ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి పవిత్రమైన మ‌ట్టి, ప‌విత్ర జ‌లాలు తీసుకొచ్చారనీ, అందుకనే కాబోలు వెల‌గ‌పూడి ఒక శ‌క్తి పీఠంలా త‌యారవబోతుందని చంద్ర‌బాబు నాయుడు  తెలిపాడు. అయితే ప్రత్యేక హోదా సాధించుకోలేకపోవడాన్ని చంద్రబాబు ఈ విధంగా సమర్థించుకుంటున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడం ముమ్మాటికీ తెదేపా వైఫల్యమేనన్నది జగమెరిగిన సత్యం. చూద్దాం అమరావతి రాజధానిని బాబు ఏమాత్రం అద్భుతంగా రూపొందిస్తారో...!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement