యాంకర్స్ కొలువులో హీరోస్..!

Tue 27th Dec 2016 08:28 PM
mega star chiranjeevi,ram charan,rana,navadeep,khaidi no 150 movie,khaidi no 150 movie pre release function in anchors rana and navadeep  యాంకర్స్ కొలువులో హీరోస్..!
యాంకర్స్ కొలువులో హీరోస్..!
Sponsored links

బాలీవుడ్ లో ఏదైనా అవార్డు వేడుకకి గాని లేక ఏదైనా ఒక భారీ ఫంక్షన్ కి గాని బాలీవుడ్ హీరోలే యాంకరింగ్ చేస్తుంటారు. వారికి ఏ విధమైన ఈగో ఫీలింగ్స్ లేకుండా సరదాగా జోక్స్ వేస్తూ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంటారు. కానీ ఇక్కడ టాలీవుడ్ లో మాత్రం హీరోలు గాని హీరోయిన్స్ గాని యాంకరింగ్ చేస్తానికి ముందుకు రారు. అసలు వారు కూర్చున్న చోటు నుండి పైకి లేవనే లెవరు. ఏదో తమని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు మాత్రమే స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తారు. 

అయితే తెలుగులో కూడా బాలీవుడ్ మాదిరిగా ఈ ఏడాది మొదట్లో జరిగిన 'ఐఫా ఉత్సవం' లో మాత్రం అల్లు శిరీష్, నవదీప్, రెజినాలు యాంకరింగ్ చేసి ఒక కొత్తవారవడికి నాంది పలికారు.  వీరి యాంకరింగ్ తో ఐఫా ఉత్సవానికి హాజరైన అతిథుల్ని నవ్వించి ఎంటర్టైన్ చేశారు. అయితే ఇప్పుడు 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా హీరోలే యాంకరింగ్ చేయబోతున్నారని సమాచారం. 'ఖైదీ..' ఆడియో వేడుకని రద్దు చేసి పాటలను నేరుగా మార్కెట్లోకి వదిలేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జనవరి 5 ,6  తారీఖుల్లో చెయ్యడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి. 

ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్లుగా రానా దగ్గుపాటి, నవదీప్ లు వ్యవహరించనున్నారని అంటున్నారు. వీరిద్దరూ రామ్ చరణ్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ 'ఖైదీ నెంబర్ 150'  ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యాంకర్స్ గా చేసి అందరిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ 'ఖైదీ...' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని విజయవాడ వేదికగా నిర్వహించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక సినిమా సంక్రాతి బరిలో ఉంటుందని ఎప్పుడో తెలియజేసాడు సదరు నిర్మాత రామ్ చరణ్.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019