Advertisement

ఇది ఆడియో వేడుకా! లేక...పొలిటికల్ మీటింగా?

Tue 27th Dec 2016 02:38 PM
nandamuri balakrishna,gautamiputra satakarni movie,balakrishna 100 movie,gautamiputra satakarni audio function,ap cm chandrababu naidu,minister venkaiah naidu  ఇది ఆడియో వేడుకా! లేక...పొలిటికల్ మీటింగా?
ఇది ఆడియో వేడుకా! లేక...పొలిటికల్ మీటింగా?
Advertisement

బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' ఆడియో తిరుప‌తిలో ఈ సోమవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు చాలామంది పెద్దలే పాల్గొన్నారు. అయితే ఏదైనా ఆడియో వేడుకకి అథిధులుగా విచ్చేసిన అతిథులు ఆ సినిమా విశేషాల గురించో లేక ఆడియో పాటల గురించో లేక హీరో గారి గురించో మాట్లాడతారు. కానీ 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' ఆడియో మాత్రం ఒక పొలిటికల్ మీటింగ్ ని తలపించిందంటే మీరు నమ్మతారో లేదో?. అసలీ ఈ 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' ఆడియోని కొన్ని ఛానెల్స్ లైవ్ లో చూపించాయి. లైవ్ చూసిన వారందరూ ఇది అసలు ఆడియో వేడుకా.. లేక పొలిటికల్ మీటింగా.. అని కామెంట్ చేస్తున్నారు.

ఈ వేడుకకి బాలకృష్ణ బావగారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. అయితే చంద్రబాబు ఈ వేడుక సాక్షిగా ఏపీ రాజధాని అమరావతిని, తెలుగు వారిని వీరలెవల్లో పొగిడేశారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ గురించి బాబు మాట్లాడుతూ... తెలుగు జాతి ఉన్నంత‌కాలం మనం మరిచిపోలేని వ్య‌క్తి ఎన్టీఆర్ గారు. సినిమాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లోనూ పెనుమార్పులు తెచ్చారు. కాంగ్రెస్‌ని త‌రిమి కాంగ్రెసేతర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.  క్రీ.శ‌కం త‌ర్వాత 70 ఏళ్ల‌కు శాలివాహ‌న రాజ్యం మొద‌లైంది ... అంటూ స్పీచినిచ్చారు.

ఇక వెంకయ్య నాయుడు అయితే తెలుగు జాతి గొప్పదనం గురించి ఏకధాటిగా చెప్పుకుంటూపోయారు. తెలుగులో మాట్లాడడానికి ఈ తరంవారు జంకుతున్నారని... తెలుగు గురించి మనం వేరేవారి నుండి తెలుసుకోవాల్సిన ఖర్మ పట్టిందని సెటేరికల్ గా మాట్లాడాడు. ఇంకా ఒక కేంద్రమంత్రి ఆడియో వేడుకకి హాజరవడం కొంచెం విచిత్రంగానే వుంది... కానీ నేను సీనియర్ ఎన్టీఆర్ తో వున్న అనుబంధం వల్ల... బాలకృష్ణతో వున్న పర్సనల్ పరిచయం వల్ల  'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' ఆడియో కి వచ్చానని చెప్పారు.ఇక వీరి స్పీచ్ చూసినవారంతా ఇది ఒక ఆడియో వేడుకలా కనిపించలేదు.... ఒక పొలిటికల్ మీటింగ్ ని తలపించిందనే కామెంట్స్ పడేస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement