Advertisementt



మళ్లీ మొదటికొచ్చిన రజినీకాంత్ కూతురు..!

Tue 27th Dec 2016 02:13 PM
rajinikanth,soundarya rajinikanth,rajinikanth daughter,divorce,dhanush  మళ్లీ మొదటికొచ్చిన రజినీకాంత్ కూతురు..!
మళ్లీ మొదటికొచ్చిన రజినీకాంత్ కూతురు..!
Advertisement
Ads by CJ

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య 2010లో బిజినెస్‌మేన్‌ అశ్విన్‌రామ్‌కుమార్‌ను వివాహం చేసుకొని సౌందర్య అశ్విన్‌గా మారింది. కానీ కొద్దికాలానికే భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత కొంతకాలంగా సౌందర్య తన తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా తన కుమార్తె వైవాహిక జీవితాన్ని చక్కబెట్టడానికి రజనీ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. సౌందర్య, అశ్విన్‌ల మద్య సంబంధాలపై ఎప్పటినుంచో కోలీవుడ్‌ కోడై కూస్తోంది. కానీ మొదట్లో ఇవ్వన్నీ పుకార్లేనని చాలా మంది భావించారు. కొంతకాలం కిందట సౌందర్యనే తమ మద్య అభిప్రాయబేధాలు ఉన్న మాట నిజమేనని, ప్రస్తుతం విడాకుల విషయంలో చర్చలు సాగుతున్నాయని తెలిపి, తమ కుటుంబం ప్రైవసీని అందరూ కాపాడాలని విజ్ఞప్తి చేయడంతో ఇది నిజమేనని తేలిపోయింది. 

దీంతో సౌందర్య అశ్విన్‌గా మారిన ఆమె దర్శకురాలి అవతారం ఎత్తి తన తండ్రితో చేసిన 'కొచ్చాడయాన్‌' చిత్రం టైటిల్‌ కార్డ్స్‌లో కూడా సౌందర్య రజనీకాంత్‌ అనే వేసుకుంది. ఇటీవల ఈ భార్యా భర్తలిద్దరు పరస్పర అంగీకారంతో చెన్నైఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశారు. తాజా సమాచారం ప్రకారం జడ్జి వీరిద్దరికి విడాకులు మంజూరు చేశారని సమాచారం. దీనిపై మరో ఒకటి రెండు రోజుల్లో సౌందర్య స్వయంగా ఈ విషయాన్ని అనౌన్స్‌ చేయనుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సౌందర్య తన బావ ధనుష్‌ హీరోగా చేస్తున్న 'విఐపి2' చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ ముహూర్తం రజనీ చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే. మొత్తానికి సౌందర్య అశ్విన్‌ ప్రస్తుతం అధికారికంగా సౌందర్యరజనీగా మారి దర్శకత్వంపై దృష్టి పెట్టింది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ