రెండోది సెట్టక్కలేదు..అప్పుడే మూడోదానికి లైన్!

Fri 23rd Dec 2016 06:55 PM
akkineni akhil,surendar reddy,akhil movie,vikram kumar,akhil 3rd film on cards  రెండోది సెట్టక్కలేదు..అప్పుడే మూడోదానికి లైన్!
రెండోది సెట్టక్కలేదు..అప్పుడే మూడోదానికి లైన్!
Sponsored links

'అఖిల్' సినిమా ఘోర ప్లాప్ తో మళ్ళీ రెండో చిత్రాన్ని మొదలు పెట్టడానికి చాలా రోజుల సమయం తీసుకున్న అఖిల్ ఇప్పుడు మూడో చిత్రాన్ని లైన్లో పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. ఒక పక్క పెళ్లి హడావిడి, మరోపక్క రెండో సినిమా సెట్స్ మీద కెళ్ళలేదు. అలాంటప్పుడు అసలు అఖిల్ మూడో సినిమాపై ఎలా మనసుపెట్టాడా... అని తెగ ఆలోచించేస్తున్నారు జనాలు. ఇక రెండో చిత్రాన్ని మొదలు పెట్టాడడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న అఖిల్ తండ్రి నాగార్జున ఎట్టకేలకు 'మనం' డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో అఖిల్ రెండో సినిమాని సెట్ చేసాడు. అయితే ఇంకా అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. కారణం విక్రమ్ కుమార్ పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం ఒక కారణమైతే...మరో కారణం అఖిల్ ఎంగేజ్మెంట్, పెళ్లి పనుల వల్ల డిలే అయ్యింది.

మరి రెండో సినిమా ఇంకా పూజా కార్యక్రమాలు మొదలెట్టుకోకుండానే అఖిల్ తన మూడో సినిమాని లైన్ లో పెట్టడానికి రెడీ అయ్యాడట. అఖిల్ తన మూడో చిత్రాన్ని 'ధృవ' దర్శకుడు సురేందర్ రెడ్డి తో చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడట. రామ్ చరణ్  హీరోగా 'ధృవ' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి.... రామ్ చరణ్ కి ఒక బంపర్ హిట్ ఇచ్చాడు. రామ్ చరణ్ ని చాలా స్టయిల్ గా చూపించి మార్కులు కొట్టేసాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ మీద మనసు పారేసుకుని ఆయనతో ఎలాగైనా తన మూడో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని.... అక్కినేని అఖిల్ అండ్ టీమ్ ప్రయత్నాలు మొదలెట్టినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ కోసం సురేందర్ రెడ్డి ఒక లైన్ వినిపించగా దానికి నాగార్జున కూడా ఇంప్రెస్ అయ్యి.. విక్రమ్ తో అఖిల్ రెండో సినిమా పూర్తవ్వగానే నీతోనే అఖిల్ మూడో సినిమాని చేద్దామని మాటిచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇదే గనక నిజమైతే అఖిల్ రెండో సినిమా తర్వాత మరో సినిమా కోసం గ్యాప్ ఎక్కువగా అయితే తీసుకోడని మాత్రం చెప్పవచ్చు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019