Advertisement

'గౌతమీపుత్ర...' పై వచ్చే వన్నీ పుకార్లేనట!

Thu 22nd Dec 2016 02:26 PM
gautamiputra satakarni,krish,bajirao mastani,rumors  'గౌతమీపుత్ర...' పై వచ్చే వన్నీ పుకార్లేనట!
'గౌతమీపుత్ర...' పై వచ్చే వన్నీ పుకార్లేనట!
Advertisement

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతికి విడుదల చెయ్యాలని బాలకృష్ణ దగ్గర నుండి డైరెక్టర్ క్రిష్ మిగతా చిత్ర యూనిట్ అంతా శతవిధాలా కష్టపడుతుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ట్రైలర్ లో బాలకృష్ణ ఆహార్యం గాని  విజువల్ ఎఫెక్ట్స్ గాని బాహుబలిని తలతన్నే రీతిలో ఉండడంతో బాహుబలికి పోటీగా ఈ చిత్రం తెరకెక్కిందని పలువురు ప్రముఖులు  డైరెక్టర్ క్రిష్ ని ప్రశంసించారు.  ఇక తెలుగు వాళ్ళు గర్వపడేలా విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న క్రిష్ ని అందరూ ఒక పక్క మెచ్చుకుంటుండగా... మరోపక్క 'గౌతమీపుత్ర శాతకర్ణి' విజువల్ వండర్స్ అన్ని ఒక బాలీవుడ్ మూవీ నుండి కాపీ చేశారనే ప్రచారం చేస్తున్నారు. 

'గౌతమీపుత్ర...' విజువల్స్ అన్నీ బాజీరావ్ మస్తానీ చిత్రం నుండి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్స్ పై స్పందించిన క్రిష్ 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని తెలుగు వారు గౌరవించేలా తెరకెక్కించామని, అలాంటి చారిత్రాత్మక చిత్రం పై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం సరికాదని అంటున్నాడు. అసలు ఈ చిత్రం మరే ఇతర చిత్రంతో పోలిక లేదని ఇది అసలు సిసలైన తెలుగు చిత్రమని.. అలాంటి చిత్రంపై నిందలు తగవని అంటున్నాడు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ ని చాలా అద్భుతంగా తెరకెక్కించామని... దీనికోసం మేము చాలా కష్టపడ్డామని చెబుతున్నాడు.

ఇదంతా ఇలా ఉండగా శాతకర్ణిపై వస్తున్న రూమర్స్ విని చాలామంది మండిపడుతున్నారు. అసలు తెలుగు వాడైనా గౌతమిపుత్రుడు కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మరాఠా వీరుడు బాజీరావ్ మస్తానీ మీద తీసిన చిత్రానికి పోలిక పెట్టడమేమిటి అని.. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతున్నారు. ఏది ఏమైనా క్రిష్ కష్టాన్ని ఇలా చులకన చెయ్యడం కరెక్ట్ కాదని అంటున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement