Advertisementt

త్రివిక్రమ్ ఎదురుచూపులు వారికోసమే..!

Wed 21st Dec 2016 10:53 PM
director trivikram,pawan kalyan,upendra,pawan trivikram combination movie  త్రివిక్రమ్ ఎదురుచూపులు వారికోసమే..!
త్రివిక్రమ్ ఎదురుచూపులు వారికోసమే..!
Advertisement
Ads by CJ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అయితే పవన్ ప్రస్తుతం చేస్తున్న 'కాటమరాయుడు' చిత్రం పూర్తి కాగానే త్రివిక్రమ్ తో చేసే సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు పవన్. ఇక పవన్ అందుబాటులోకొచ్చేవరకు త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను, స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించే నటీనటుల వేటలో కూడా త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. 

ఈ చిత్రం లో పవన్ పక్కన మొదటిసారి కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా తీసుకోగా.... మరో కీ రోల్ కోసం త్రివిక్రమ్ కన్నడ నటుడు ఉపేంద్రని సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ ఉపేంద్రకి 'సన్నాఫ్ సత్యమూర్తి' లో విలన్ రోల్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు పవన్ సినిమాకి కూడా ఉపేంద్రని సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఉపేంద్ర కోసం స్పెషల్‌గా ఓ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఆ కేరెక్టర్ గురించి త్రివిక్రమ్, ఉపేంద్రకి చెప్పగా..... అది విన్న ఉపేంద్ర ఈ ప్రాజెక్ట్ లో చెయ్యడానికి ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. 

ఇక ఉపేంద్ర ఈ చిత్రంలో కీ రోల్ చెయ్యడం.... ఇప్పటికే త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కూడా కీలక పాత్రలో చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా దేవుడే దిగి వచ్చిన అని పెట్టారు. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ