Advertisement

సూర్య బరిలో లేకపోవడంతో వీళ్లు యమా హ్యాపీ..!

Sun 18th Dec 2016 12:05 PM
s3 movie,okkadochadu,saptagiri express,pittagoda,intlo deyyam nakem bhayyam  సూర్య బరిలో లేకపోవడంతో వీళ్లు యమా హ్యాపీ..!
సూర్య బరిలో లేకపోవడంతో వీళ్లు యమా హ్యాపీ..!
Advertisement

ఈనెల 23న తమిళ, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుందని భావించిన స్టార్‌ హీరో సూర్య, దర్శకుడు హరిల కాంబోలో రూపుదిద్దుకుంటోన్న 'ఎస్‌3' చిత్రం వాయిదా పడటంతో ఈ తేదీని క్యాష్‌ చేసుకోవాలని కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు భావిస్తున్నారు. విశాల్‌, మిల్కీబ్యూటీ తమన్నా, జగపతిబాబుల కాంబినేషన్‌లో సురాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కత్తి సందై' (తెలుగులో 'ఒక్కడొచ్చాడు') చిత్రం వాస్తవానికి నవంబర్‌లోనే విడుదల కావాల్సివుండగా, కరెన్సీ ఇబ్బందుల వల్ల పొంగల్‌ బరిలో దించాలని తొలుత భావించారు. కానీ పొంగల్‌ బరిలో తమిళ స్టార్‌ విజయ్‌ చిత్రం, తెలుగులో కూడా బాలయ్య, చిరుల చిత్రాలు విడుదల కానుండంతో ఇప్పుడు అందివచ్చిన అనుకోని అదృష్టాన్ని ఉపయోగించుకొని, ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 23న విడుదల చేయడానికి డిసైడ్‌ అయ్యారు. ఐదేళ్ల తర్వాత తమిళ వెటరన్‌స్టార్‌ కమెడియన్‌ వడివేలు ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వనుండటం, ఇటీవలే తమిళ 'తనిఒరువన్‌'తో పాటు దాని తెలుగు రీమేక్‌ 'ధృవ'కు సంగీతం అందించిన హిప్‌హాప్‌ దీనికి సంగీతం అందిస్తుండం విశేషంగా చెప్పాలి.

మరో పక్క ఈనెల 23న వస్తున్న స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి హీరోగా నటిస్తున్న 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' యూనిట్‌ కూడా ఈ పరిణామంతో ఎంతో హ్యాపీగా ఉంది. ఇక చిన్న చిత్రంగా రూపొంది సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేష్‌బాబు మెప్పును పొంది... 'పెళ్లి చూపులు' చిత్రం అన్నిబాధ్యతలను తనపై వేసుకొని సురేష్‌ విడుదల చేసిన ఈ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి అందరికీ తెలిసిందే. కాగా తాజాగా మరో చిన్న చిత్రంగా నూతన దర్శకుడు అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'పిట్టగోడ' చిత్రం చూసి ఎంతగానో ఇన్‌స్పైర్‌ అయిన సురేష్‌బాబు ఈ చిత్రానికి సమర్పకునిగా మారి తన పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 24న విడుదల చేస్తుండటంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు పెరిగాయి. మరోపక్క డిసెంబర్‌ 30న రావాలని డిసైడ్‌ అయిన అల్లరినరేష్‌ చిత్రం 'ఇంట్లో దెయ్యం.. వీధిలో భయం' చిత్రాన్ని కూడా కాస్త ముందుగానే అంటే ఈనెల 23న లేదా 24న విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌ తాజా సమాచారం. మరి ఈ చిత్రాలన్నింటికి పరోక్షంగా సూర్య ఎంతో హెల్ప్‌ చేశాడనే చెప్పవచ్చు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement