రాజమౌళిపై తీవ్ర విమర్శలు..!

Fri 16th Dec 2016 09:41 PM
director raja mouli,baahubali 2 movie,hero prabhas,vilan rana,heroine tamanna,anushka,ramya krishna  రాజమౌళిపై తీవ్ర విమర్శలు..!
రాజమౌళిపై తీవ్ర విమర్శలు..!
Sponsored links

'బాహుబలి పార్ట్‌1' సాధించిన సంచలన విజయంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం రెండో పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా రానా బర్త్‌డే సందర్భంగా భల్లాలదేవ 'గెటప్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్‌లో రానా మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నప్పటికీ ఈ గెటప్‌లో రానాకు వాడిన కాస్ట్యూమ్స్‌ మీద మాత్రం పలు విమర్శలు వస్తున్నాయి. 

ఈ చిత్రంలో హాలీవుడ్‌ చిత్రాలలోని 'ఐరన్‌మ్యాన్‌' తలను పోలినట్లుగా రానా తల ఉందని కొందరు, 'పవర్‌ రేంజర్స్‌' క్యారెక్టర్స్‌ను పోలి ఉందని మరికొందరు సోషల్‌ మీడియా వేదికపై రాజమౌళిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇలా కాపీ కొడితే ఈ చిత్రం రేపు విడుదలైన తర్వాత అందరి నుండి విమర్శలు తప్పవని, దాంతో టాలీవుడ్‌ అంటే కాపీ రాయుళ్లకు నిలయమనే చెడ్డపేరు వస్తుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాజమౌళి వంటి ఇంటెలిజెంట్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ ఇలాంటి తప్పు ఎలా చేశాడో అర్దం కావడం లేదని అంటున్నారు.కాగా ఈ చిత్రం రెండో పార్ట్‌ తర్వాత రాజమౌళి 'గరుడ' లేదా 'మహాభారతం' చిత్రాలలో దేన్నో ఒకదాన్ని పట్టలెక్కిస్తాడని ఇంతకాలం అందరూ ఊహిస్తూ వచ్చారు. అలాగే ఈ చిత్రం తర్వాత మాత్రం రాజమౌళి బాలీవుడ్‌కు వెళ్లిపోతాడని ప్రచారం జరిగింది. తాను బాలీవుడ్‌కి వెళ్లిపోతాననే వార్తలను ఆయన ఖండించినప్పటికీ ఆయన తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ హీరోగా చేయడానికి జక్కన్న తెరవెనుక సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే రాజమౌళితో కలిసి చేయడానికి అమీర్‌ కూడా ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019