Advertisementt

ఆ తరువాత ఇలా పార్టీ చేసుకున్నారట..!

Mon 12th Dec 2016 12:54 PM
akkineni nagarjuna,akhil,naga chaitanya,afetr engagement party,guests nikhil,akhil best friend nikhil,samantha  ఆ తరువాత ఇలా పార్టీ చేసుకున్నారట..!
ఆ తరువాత ఇలా పార్టీ చేసుకున్నారట..!
Advertisement
Ads by CJ

డిసెంబర్ 9 న అక్కినేని నాగార్జున చిన్న తనయుడు అఖిల్ అక్కినేని, జీవీకే మనవరాలు శ్రీయ భూపాల్ కి అతి కొద్ది మంది సన్నిహితులు, అతిధుల మధ్యన అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ నుండి కొంతమంది  సన్నిహితులు మాత్రమే అఖిల్ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారని సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. ఇక నాగార్జునకి బిజినెస్ పార్టనర్ మరియు అత్యంత సన్నిహితుడు చిరంజీవి, రానా, అఖిల్ బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ మొదలగు వారు ఈ వేడుకకి హాజరైనట్టు సమాచారం. ఇక అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు తన లవర్ సమంతతో అఖిల్ ఎంగేజ్మెంట్ లో సందడి చేసాడు. అయితే నాగార్జున, అఖిల్, నాగ చైతన్యలు ముగ్గురు అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన సందర్భంగా ఒక పార్టీ చేసుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ పార్టీ కి కూడా నాగార్జున చాలా దగ్గర వారినే ఇన్వైట్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ పార్టీ లో తీసిన ఒక పిక్ ని అన్నపూర్ణ స్టూడియాస్ వారు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో లో నాగార్జున తన ఇద్దరు కొడుకులు అఖిల్, నాగ చైతన్యతో పార్టీ బాగా ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తుంది. మరి మీరు ఆ ఫోటో ని  ఒక లుక్ వెయ్యండి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ