Advertisement

చిరు జడ్జిమెంట్‌ తప్పని తేలిందట..!

Wed 07th Dec 2016 09:02 PM
chandramukhi movie,director p vasu,rajinikanth,tamil,telugu,v s aditya,chiranjeevi,chiranjeevi judgement fail  చిరు జడ్జిమెంట్‌ తప్పని తేలిందట..!
చిరు జడ్జిమెంట్‌ తప్పని తేలిందట..!
Advertisement

రజనీకాంత్‌, ప్రభు, జ్యోతిక, నయనతారలు ముఖ్యపాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన 'చంద్రముఖి' చిత్రం తమిళ, తెలుగుభాషల్లో ఎంతటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 1993లో మోహన్‌లాల్‌, సురేష్‌గోపి, శోభన నటించిన మలయాళ చిత్రం 'మణిచిత్ర తాలు'కు రీమేక్‌. ఈ చిత్రం ఇప్పటివరకు మలయాళంలో వచ్చిన టాప్‌టెన్‌ చిత్రాలలో ఒకటి.ఈ చిత్రానికి ఫాజిల్‌ దర్శకుడు. కాగా ఈచిత్రం విడుదలైన 23ఏళ్లకు ఈ చిత్రం ఓరిజినల్‌ మలయాళ వెర్షన్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయి, ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై ఉన్న అభిమానంలో ఓ నెటిజన్‌ ఈ చిత్రం ట్రైలర్‌ను కట్‌ చేసి, ఎడిట్‌ చేసి విడుదల చేశాడు. కాగా ఈ చిత్రం మలయాళలో వచ్చిన ఎంతో కాలానికి దర్శకుడు పి.వాసు సలహాతో కన్నడస్టార్‌ విష్ణువర్దన్‌ కన్నడలోకి రీమేక్‌ చేశాడు. 'ఆప్తమిత్ర' పేరుతో 2004లో విష్ణువర్దన్‌, సౌందర్యలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం కన్నడలో కూడా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత దీనిని రజనీకాంత్‌ అదే దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో నిర్మించాడు. కాగా ఈ చిత్రం మలయాళ వెర్షన్‌ చూసిన దర్శకుడు, 'మనస్సంతానువ్వే, నేనున్నాను' వంటి హిట్స్‌ ఇచ్చి, అంతకుముందే చిరు నటించిన 'బావగారూ..బాగున్నారా' చిత్రానికి డైరెక్షన్‌ డిప్టార్ట్‌మెంట్‌లో పనిచేసి, ఆ టైటిల్‌ను చిరుకు సూచించి చిరు మెప్పును పొందిన వి.యన్‌.ఆదిత్యకు ఆయన దర్శకునిగా ఓ చిత్రం చేస్తానని ఆ చిత్రం ఫంక్షన్‌లో ప్రామిస్‌ చేశాడు.దీంతో ఈ చిత్రం మలయాళ వెర్షన్‌ చూసి ముగ్దుడైన వి.యన్‌.ఆదిత్య ఈ చిత్రం డివిడిని చిరుకి చూపించి, మీరు సైకియాట్రిస్ట్‌గా నటిస్తే సూపర్‌గా ఉంటుందని చెప్పాడట. కానీ చిరు మాత్రం ఆ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒంటపట్టదని చెప్పి, ఆదిత్య మాటను తిరస్కరించాడట. కానీ 'చంద్రముఖి' చిత్రం రిలీజై సంచలన విజయం నమోదు చేసిన తర్వాత ఆయన ఆదిత్యను పిలిచి, నీ జడ్జిమెంటే నిజమైందని అభినందించాడట. అది సంగతి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement