Advertisement

టీవీ మీడియా అత్యుత్సాహం..!

Tue 06th Dec 2016 04:37 PM
tamilnadu,cm jayalalithaa,death news,advance telecast in tv channels,tamilnadu cm jayalalithaa death news  టీవీ మీడియా అత్యుత్సాహం..!
టీవీ మీడియా అత్యుత్సాహం..!
Advertisement

మీడియా అంటే ఉద్రిక్తతలు పెంచుతుందా ? లేక పెంచకుండా సంయమనం పాటిస్తుందా? అంటే సంయమనం అని ఎవరైనా అంటారు. కానీ తెలుగు, తమిళ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం ప్రజల్లో ఉద్రిక్తత పెరగడానికి, ప్రజలు ఆందోళన చెందడానికి కారణమైంది. జయలలిత గురించి ఈ మీడియా చేసిన ప్రచారం ప్రజలను నిద్రపోనివ్వలేదు. ఒకవైపు హాస్పటల్లో చికిత్స జరుగుతుండగానే, కొన్ని ఛానల్స్ జయలలిత కన్నుమూత అని ప్రసారం చేసి గందరగోళం చేశాయి. వాటిని తెలుగు ఛానల్స్ ఫాలో అయ్యాయి. 

చెన్నైలోని అపోలో హాస్పటల్ వద్ద తిష్టవేసి ఆందోళన కలిగించే వార్తలను ప్రసారం చేశాయి. జయలలితకు ఏదైనా జరిగితే రాష్ట్రం తగలపడి పోతుందని భయపెట్టాయి. సరిహద్దులు మూశారని, సెల్ టవర్సు లాక్ చేశారని, ఐ.టి. పరిశ్రమ సెలవులు ప్రకటించిందని, షాపులు  బంద్ చేశారని ఇలా అనేక రకాల సొంత వడ్డింపులతో ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించారు. జయకు ఏదైనా జరిగితే ప్రమాదం అని మీడియానే హెచ్చరికలు జారిచేసినట్టుంది. 

జయ ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా వచ్చింది కాదు. ఆమె 75రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. అంటే ప్రజల్లో అప్పటికే ఆమె గురించి స్పష్టమైన అవగాహన ఉంది. వ్యక్తిగత పూజలు అందుకునే తమిళనాడులో ఉద్రిక్తతలు పెరగకుండా, అధికార ప్రకటన వచ్చే వరకు మీడియా ఆగలేకపోయింది. చివరికి తమిళ ఛానల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించే వరకు పరిస్థితి తెచ్చుకుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement