Advertisementt

'బాహుబలి' పైనే ఆధారపడ్డ ఈ ముగ్గురి పెళ్లిళ్లు!

Sun 04th Dec 2016 11:53 AM
bahubali,prabhas,rana,anushka,marriage,bahubali movie  'బాహుబలి' పైనే ఆధారపడ్డ ఈ ముగ్గురి పెళ్లిళ్లు!
'బాహుబలి' పైనే ఆధారపడ్డ ఈ ముగ్గురి పెళ్లిళ్లు!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధానపాత్రలలో రూపొందిన 'బాహుబలి పార్ట్‌1' ఎంతో సంచలనం సృష్టించడమే కాకుండా ఆ చిత్రంలో నటించిన నటీనటులకు కూడా దేశవిదేశాలలోని దాదాపు అన్ని భాషల సినీ ప్రేమికులలో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ విషయంలో ప్రభాస్‌, రానాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తమకు దేశంలోని అన్ని భాషల్లో వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకోవడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. అదే సమయంలో ఈ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ను మరింత అద్భుతంగా చూపించడం కోసం దాదాపు మూడువందల మంది నిపుణులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. కమల్‌ కన్నన్‌ నేతృత్వంలో ఈ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా రూపొందుతున్నాయని సమాచారం. ఇలా షూటింగ్‌ పార్ట్‌తో పాటు పోస్ట్‌ప్రొడక్షన్స్‌ను కూడా సమాంతరంగా జరిపి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరి నిముషం వరకు టెన్షన్‌తో పనిచేయడం కంటే ముందు నుంచే ప్లాన్‌ చేసుకొని విడుదలకు ఓ నెల ముందుగానే అన్నికార్యక్రమాలను పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి, విడుదలైన తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్న ముగ్గురి వివాహాలు జరగనున్నాయని, అందుకోసం ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆ ముగ్గురితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఎదురుచూపులు చూస్తున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో మొదలైంది. ఈ చిత్రం విడుదలయ్యే లోపే 'భాగమతి' చిత్రం షూటింగ్‌ను కూడా పూర్తి చేసి హీరోయిన్‌ అనుష్క, బెంగుళూరుకు చెందిన ఓ బిజినెస్‌మేన్‌ను పెళ్లాడనుందంటున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ కుటుంబ సభ్యులు కూడా ఆయనకు వీలైనంత త్వరగా పెళ్లి చేసే యోచనలో ఉన్నట్లు, అలాగే రానా విషయంలో కూడా ఆయన తండ్రి సురేష్‌బాబు ఇదే అభిప్రాయంతో ఉన్నాడనే వార్తలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ