అమీర్‌ మరోసారి నిరూపించుకున్నాడు..!

Thu 01st Dec 2016 04:28 PM
aamir khan,yudham movie,bollywood,kamal haasan,vikram,dangal movie  అమీర్‌ మరోసారి నిరూపించుకున్నాడు..!
అమీర్‌ మరోసారి నిరూపించుకున్నాడు..!
Advertisement
Ads by CJ

దక్షిణాదిలో కమల్‌హాసన్‌, విక్రమ్‌ వంటి నటులు తమ సినిమాలోని పాత్రల కోసం ఎంతటి కష్టానైన్నా పడతారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలోనే కాదు.. ఆ పాత్రకు తగ్గ శరీరాకృతి, బాడీలాంగ్వేజ్‌ కోసం రాత్రింబగళ్లు తపించింది పోతుంటారు. ఇక బాలీవుడ్‌లో ఈతరం హీరోలలో ఆ స్థాయిలో కష్టపడే మిష్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా అమీర్‌ఖాన్‌కు కూడా అంత పేరుంది. తాజాగా ఆయన 'దంగల్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్‌ 23న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన అవుట్‌పుట్‌ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో అమీర్‌ ఓ కుర్రాడు అయిన మల్లయోధునిగా, అదే సమయంలో నలుగురు అమ్మాయిల తండ్రిగా రెండు షేడ్స్‌ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. బయోపిక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యువకుడైన రెజ్లర్‌గా ఆయన సిక్స్‌ప్యాక్‌ బాడీలో కండలు తిరిగి కనిపిస్తాడు. ఈ సిక్స్‌ప్యాక్‌ను ఆయన కేవలం మూడునెలల్లోనే సాధించడం విశేషం. ఇక తండ్రిగా ఓల్డ్‌ గెటప్‌లో కనిపించే ఆయన ఆ పాత్ర కోసం తన బరువును 120 కేజీలకుపెంచి, వయసుగా తగ్గట్లుగా భారీ పొట్ట వేసుకొని కనిపిస్తాడు. వీటి కోసం ఆయన పడిన కష్టాన్ని వీడియోలో చూసిన వారు ఆయనకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. కాగా ఈ చిత్రం తెలుగులోకి కూడా 'యుద్దం' పేరుతో అనువాదమై హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ