Advertisementt

ఈ హీరోకి అనుకోని షాక్..!

Thu 01st Dec 2016 02:09 PM
jr ntr,director babi,tollywood,abhi shek bachchan  ఈ హీరోకి అనుకోని షాక్..!
ఈ హీరోకి అనుకోని షాక్..!
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ప్లాప్ దర్శకుడు బాబీతో సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు దాదాపు ఈ సినిమా ఫిక్స్ అయిపోయి పూజా కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందని.... కోన వెంకట్ చెప్పిన కథ నచ్చి  ప్లాపుల్లో వున్న డైరెక్టర్ బాబీకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడని... అబ్బో ఒకటేమిటి చాలానే ప్రచారం జరిగింది. అయితే 'జనతా గ్యారేజ్' తో వచ్చిన హిట్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చక చాలా రోజుల నుండి సందిగ్ధంలో వున్న ఎన్టీఆర్ కి డైరెక్టర్ బాబీ, కోన వెంకట్ చెప్పిన కథ నచ్చి వారి కాబినేషన్ లో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడట. ఇక కోన చెప్పిన కథ ఎన్టీఆర్ చాల బాగా నచ్చి ఓకె చేసాడని ప్రచారం జరుగుతుంది.

దాదాపు బాబీ- ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కుతోంది అని అనుకుంటున్న టైమ్ లో  కోన వెంకట్ ఎన్టీఆర్ కి ఊహించని షాకిచ్చాడట. కోన, బాబీ  ఎన్టీఆర్ కి వినిపించి మెప్పించిన కథని కోన వెంకట్ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కి అమ్మేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి కోన, ఎన్టీఆర్ కి చెప్పిన కథని అభిషేక్ కి ఎందుకు అమ్మేశాడో తెలియదుగాని... ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడని అంటున్నారు. నచ్చక నచ్చక ఒక కథ నచ్చి.... ప్లాపు డైరెక్టర్ బాబీని ఎంచుకుని సాహసం చేసిన ఎన్టీఆర్ కి కోన గట్టి షాక్ ఇచ్చాడని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఏన్టీఆర్ మాత్రం ఆ కథని చేజార్చుకున్నందుకు తెగ ఇదైపోతున్నాడని అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ