Advertisementt

దెయ్యంగా ఈ హీరోయిన్ భలే వుంది..!

Wed 30th Nov 2016 03:08 PM
regina,nenjam marappathillai,devil,regina beautiful devil  దెయ్యంగా ఈ హీరోయిన్ భలే వుంది..!
దెయ్యంగా ఈ హీరోయిన్ భలే వుంది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో రెజినా చిన్నా, పెద్ద హీరోలతో నటిస్తూ బిజీ అయిపోయింది. గ్లామర్ పరంగా పర్వాలేదనిపించిన ఈ భామ నటన కి 100 శాతం మార్కులు వేయించుకుంటూ ఆఫర్స్ పట్టేస్తుంది. ఇక ప్రస్తుతానికి రెజినా తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్ లో 'నక్షత్రం' సినిమాలో నటిస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ పరంగా రెచ్చిపోయిన రెజినా ఇప్పుడు ఒక అందమైన దెయ్యంలా కనిపిస్తుందని అంటున్నారు. అదీ ఒక తమిళ సినిమా అయిన 'నింజామ్ మారప్పతిల్లై' లో. ఈ సినిమాని డైరెక్టర్ సెల్వరాఘవన్ తెలుగు, తమిళంలో ఏకకాలం లో తెరకెక్కిస్తున్నాడు. ఇక తొలిసారి హారర్ చిత్రంలో నటిస్తున్న రెజినా 'నింజామ్ మారప్పతిల్లై' సినిమాలో అందమైన దెయ్యంలా కనిపించనుందని ఆ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంలో రెజీనా... నిఖిల్ తో కలిసి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంలో కీ రోల్ లో నటించిన నందిత శ్వేతతో కలిసి నటించబోతుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందని సమాచారం. పై ఫోటో చూశారుగా.. దెయ్యంగా రెజినా..ఎంత అందంగా వుందో..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ