Advertisementt

ధృవ లోకల్‌ వేడుక..!

Wed 30th Nov 2016 12:33 PM
dhruva,dhruva pre release function,hyderabad,ganta srinivasa rao,chiranjeevi  ధృవ లోకల్‌ వేడుక..!
ధృవ లోకల్‌ వేడుక..!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌ 'ధృవ' ప్రీ రిలీజ్‌ హడావుడి హైదరాబాద్‌కే పరిమితం చేశారు. సినిమా ప్రమోషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లో వేడుక నిర్వహిస్తారని అభిమానులు భావించారు. కానీ అల్లు అరవింద్‌ మాత్రం మరోలా ఆలోచించారు. అందుకే హైదరాబాద్‌కే ఓటు వేశారు. గతంలో 'సరైనోడు' ప్రీ రిలీజ్‌ వేడుకను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కొడుకు సినిమాకు చేసిన విధంగానే 'ధృవ' సినిమాకు చేస్తారని అభిమానులు ఆశించారు. 

'సరైనోడు' ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మంత్రి గంట శ్రీనివాసరావు సైతం వచ్చారు. ఇదే వేడుకపై స్థలం కేటాయిస్తే వైజాగ్‌లో ఇల్లు కట్టుకుంటాను అంటూ చిరంజీవి మనసులో మాటను వెల్లడించారు. ఇది వివాదస్పదమైంది. అలాగే మంత్రి గంట చిత్రపరిశ్రమ మొత్తం వైజాగ్‌ రావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడేమో గంట చక్రం తిప్పిన వైజాగ్‌ ఫిల్మ్‌ క్లబ్‌ వివాదమైంది. ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోనుంది. అందుకే 'ధృవ' వేడుకను హైదరాబాద్‌కే పరిమితం చేశారు. వైజాగ్‌లో నిర్వహిస్తే స్థానిక మంత్రిగా గంటను పిలవాలి. పైగా చిరంజీవికి గంట అత్యంత సన్నిహితుడు. అలా పలుకారణాల వల్ల వేదిక మారింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ