ఈ ఇద్దరి జోడి బావుంటుందంట..!

రామ్ చరణ్ తాజాగా నటించిన 'ధృవ' చిత్రం డిసెంబర్ 9 న విడుదలకు సిద్ధమైంది. ఇక 'ధృవ' చిత్రం విడుదల కాగానే రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి సిద్ధంగా వున్నాడు. ఇక సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ చిత్రం ప్రేమ కథా చిత్రంగా ఉండబోతుందట. ప్రేమ నేపధ్యం లో తెరకెక్కే ఈ చిత్రం లో రామ్ చరణ్ పక్కన ఏ హీరోయిన్ అయితే బావుంటుందో అని సుకుమార్ తెగ సెర్చ్ చేస్తున్నాడని టాక్. అయితే ఇప్పటికే రామ్ చరణ్ పక్కన రాశి ఖన్నా ఎంపికైందని వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రం పల్లెటూరి నేపధ్యం లో రూపొందే కథ గా 1980 వ దశకంలో జరిగినట్టు తెరకెక్కిస్తారు కాబట్టి రాశి చరణ్ పక్కన బాగోదని మరో హీరోయిన్ ని సెట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు 'జనతా గ్యారేజ్' తర్వాత తెలుగులో ఏ సినిమాలు ఒప్పుకోకుండా ఖాళీగా ఉన్న సమంత అంట. సమంత, నాగ చైతన్యతో లవ్ లో ఉండి..... చైతూని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. అందుకే ఆమె ఏ సినిమాలు ఒప్పుకోకుండా ఖాళీగా ఉందనే ప్రచారం మొదలైంది. కానీ సమంత ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ తమిళం లో రెండు, మూడు సినిమాల్లో నటించడానికి సైన్ చేసింది. అలాగే ఇప్పుడు చరణ్ పక్కన టాలీవుడ్ లో నటించడానికి రెడీ అయ్యిందంటున్నారు. మరి మొదటిసారి రామ్ చరణ్ , సమంతతో జోడి కడుతున్నాడు.  రామ్ చరణ్ సరసన సమంత అంటే ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడినట్టే. ఇక వీరి ఫెయిర్ బావుంటుందని సుకుమార్ కూడా ఫిక్స్ అయ్యాడని..... అందుకే సుకుమార్ సమంతని ఒప్పించాడని అంటున్నారు.

ram charan
samantha
director sukumar
villege love story in 1980s
sukumar ram charan combination