Advertisementt

బబ్లీ బ్యూటీకి కీలకంగా మారిన చిత్రం!

Sun 27th Nov 2016 02:55 PM
hansika,lakkunnodu movie,manchu vishnu,bubbly beauty  బబ్లీ బ్యూటీకి కీలకంగా మారిన చిత్రం!
బబ్లీ బ్యూటీకి కీలకంగా మారిన చిత్రం!
Advertisement
Ads by CJ

మంచు మోహన్‌బాబు పెద్దకుమారుడు మంచు విష్ణు ప్రస్తుతం 'గీతాంజలి' వంటి హర్రర్‌, కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించి, తొలిచిత్రంతోనే ఆకట్టుకున్న డైరెక్టర్‌ రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో, 'గీతాంజలి' నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాణంలో 'లక్కున్నోడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. విష్ణుకు బాగా వర్కౌట్‌ అయిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం కూడా రూపొందింది. కాగా ఇందులో విష్ణు సరసన బబ్లీ బ్యూటీ హన్సిక నటిస్తోంది. 'దేశముదురు' చిత్రం ద్వారా దర్శకుడు పూరీజగన్నాథ్‌ టాలీవుడ్‌కి పరిచయం చేసిన బబ్లీ బ్యూటీ హన్సిక మాస్‌మహారాజా రవితేజ సరసన 'పవర్‌' చిత్రంలో అవకాశం రావడంతో ఆ చిత్రం హిట్‌ అయితే తనకు స్టార్స్‌ సరసన మరలా అవకాశాలు వస్తాయని ఎంతగానో ఆశించింది. ఈ చిత్రం ఓకే అనిపించినా హన్సిక లక్‌ మాత్రం మారలేదు. ఆమెకు కొత్తగా అవకాశాలు ఏమీ వెల్లువెత్తలేదు. కాగా ప్రస్తుతం హన్సిక విష్ణుతో మూడోసారి జతకడుతోంది. ఇంతకు ముందు ఆమె విష్ణు సరసన 'దేనికైనా రెడీ', మంచు ఫ్యామిలీ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాలలో కలసి నటించింది. దీనిలో 'దేనికైనా రెడీ' మంచి హిట్‌ కాగా, ఓవర్‌బడ్జెట్‌ కారణంగా 'పాండవులు...పాండవులు.. తుమ్మెద' చిత్రం మాత్రం యావరేజ్‌ దగ్గరే ఆగిపోయింది. ఈ చిత్రం డైరక్టర్‌ శ్రీవాస్‌కు ఉపయోగపడిందే గానీ మంచు ఫ్యామిలీకి పెద్దగా ఉపయోగపడలేదు. కాగా ఇప్పుడు 'లక్కున్నోడు' చిత్రంలో కూడా హన్సికనే నటిస్తుండటంతో ఈ చిత్రంపై విష్ణు బాగా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం కూడా హిట్టేనని, కాబట్టి ఈ చిత్రం తమ ఇద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా నిలుస్తుందని అంటున్నాడు. కాగా 'లక్కున్నోడు' టీజర్‌లో విష్ణు, హన్సికల మధ్య బాగానే కెమిస్ట్రీ వర్కౌట్‌ అయినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం విజయం విష్ణుతో పాటు హన్సికకు కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ చిత్రంతో పాటు ఆమె ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒకే ఒక్క చిత్రం చేస్తోంది. ఇక ఆమె తెలుగులో గోపీచంద్‌ సరసన సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. మరి 'లక్కున్నోడు' చిత్రం హన్సిక లక్‌ను మారుస్తుందా? అందం, దానిని చూపించే తత్వం లాంటివి అన్నీ ఉన్నప్పటికీ ఈ మధ్య పెద్దగా అవకాశాలు సంపాదించలేకపోతున్న హన్సికకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుంది? అనేది కీలకంగా మారింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ