ఎన్టీఆర్ ఎవరో తెలియదంటున్న దర్శకుడు..!

Fri 25th Nov 2016 04:57 PM
ntr,singam 3,hari,director hari movies,suriya director,hari comments on ntr  ఎన్టీఆర్ ఎవరో తెలియదంటున్న దర్శకుడు..!
ఎన్టీఆర్ ఎవరో తెలియదంటున్న దర్శకుడు..!
Sponsored links

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారుండరు. అలాంటిది ఓ తమిళ దర్శకుడు ఎన్టీఆర్ అంటే ఎవరో తనకు తెలియదంటూ సంచలనం రేపేలా కామెంట్ చేశాడు. అయితే ఎన్టీఆర్ కు టాలీవుడ్ తో పాటు మలయాళం, కన్నడం, తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా సింగం సినిమా ద్వారా అందరికీ పరిచయం అయిన దర్శకుడు హరితో అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై హరి స్పందిస్తూ.. సింగం3 ప్రమోషన్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తో మీరు సినిమా చేయబోతున్నారట కదా? అని అడగడంతో… అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో తనకు తెలియదని నోరుజారాడు. ఆశ్చర్యం ఎంటంటే దర్శకుడై ఉండి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియకపోవడం. ఇంకా హరి మాట్లాడుతూ..  ఎన్టీఆర్ ను తాను ఎప్పుడూ కలవలేదని కూడా అంటున్నాడు. ఇంకా హరి స్పందిస్తూ... తన తదుపరి సినిమా చియ్యాన్ విక్రమ్ తో ఉంటుందని వెల్లడించాడు. కాగా ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం దర్శకుడు హరిపై గుర్రుగా ఉన్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019