ఇద్దరూ మెగా హీరోలే అయినప్పటికీ రూట్లు మాత్రం సపరేట్. వారిద్దరు ఎవరో కాదు చిరంజీవి, పవన్ కల్యాణ్. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టి మూసేశాక, తమ్ముడు జనసేన పార్టీ పెట్టాడు. అన్నయ్య తన కొత్త చిత్రానికి అనేక కథలు విని చివరికి రీమేక్ కథకు ఓకే చేయగా, తమ్ముడు కూడా అదే రూట్ ఫాలో అయ్యాడు. తన కొత్త సినిమాను రీమేక్ కథతో తీస్తున్నారు. గతంలో తను నటించిన సినిమాలకు అన్నయ్య అతిథిగా వచ్చేవారు. ఇప్పుడు అన్నయ్య నటించిన తాజా చిత్రానికి పవన్ అతిథిగా వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇలా అనేక పోలికలు కనిపిస్తున్న సమయంలో ఇటీవలే జరిగిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ కుమార్తె వివాహానికి సైతం తొలుత చిరంజీవి వచ్చి వెళ్ళాకే తమ్ముడు పవన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇది కాకతాళీయమే అనుకోవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆసక్తి కలిగిస్తున్నాయి.