భారతదేశం గర్వించదగ్గ నేేటితరం దర్శకుల్లో దక్షిణాదికి చెందిన శంకర్ ఒకరు. ఆయన తన కెరీర్ ప్రారంభంలో యువత మెచ్చే 'ప్రేమికుడు' వంటి లవ్‌సబ్జెక్ట్‌ను, సందేశాత్మకమైన 'జెంటిల్‌మేన్, భారతీయుడు' వంటి చిత్రాలను ఆ తర్వాత కూడా మంచి సందేశాత్మక చిత్రంగా పేరుతెచ్చుకున్న బాలీవుడ్ 'త్రీ ఇడియట్స్'ను రీమేక్ చేయడం, రజనీకాంత్‌తో కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ 'శివాజీ', విక్రమ్‌తో 'అపరిచితుడు' వంటి చిత్రాలను, వైవిధ్యభరితమైన 'జీన్స్' వంటి అన్ని రకాల చిత్రాలను చేస్తూ, మరీ ముఖ్యంగా సందేశాన్ని కూడా జనాలు మెచ్చేలా కమర్షియల్ ఫార్మెట్‌లో చెప్పడం ద్వారా అందరినీ మెప్పించాడు. కానీ 'రోబో' చిత్రం తర్వాత మాత్రం ఆయన రూట్ మారింది. అంతర్లీనంగా సందేశంతోనే 'రోబో', 'ఐ'; తాజాగా రోబోకు సీక్వెల్‌గా '2.0 ' చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాల ద్వారా ఆయన సరికొత్త టెక్నాలజీకి బానిసైపోయాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ '2.0' చిత్రం తర్వాత కూడా తాను '3.0, 4.0 ' పేరుతో 'రోబో' కు సీక్వెల్స్ చేస్తానని ప్రకటించాడు. ఇలా చిత్రాలు చేయాలని, ఎప్పటికప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని మన దేశ ప్రేక్షకులకు తన చిత్రాల ద్వారా రుచి చూపించాలనేది ఆయన అంతరంగంగా చెబుతున్నారు. దీంతో ఆయన నుండి అన్నిరకాల చిత్రాలను, మరీ ముఖ్యంగా సామాజిక చైతన్యం కలిగిన చిత్రాలను ఆశించే వారికి మాత్రం ఈ పరిణామాలు తీవ్ర అసంతృప్తిని కలిగించకమానవు.